ఎంతో హుందాగా అదరగొట్టిన మహేష్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భరత్ అనే నేను లో స్మార్ట్ గా కనిపించిన మన సూపర్ స్టార్ ఇప్పుడు తన 25వ సినిమాకోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నారని తెలిసిన విషయమే.

మహేష్ తన కొత్త లుక్ తో లేటెస్ట్ గా ఒక టీ.వి. కమర్షియల్ లో నటించాడు. ఈ కొత్త టీవి స్పాట్ ల్ సూపర్ స్టార్ తన న్యూ లుక్ తో అదరగొడుతున్నాడనే చెప్పాలి. అభిమానులు ఫుల్ ఖుషీగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ చేసేస్తున్నారు.

సినిమాల్లో నన్ను సూపర్‌స్టార్ చెసింది నా వాళ్ళు.. అంటే మీరు..మీ లైఫ్ లో మీరు కూడా సూపర్‌స్టార్ కావొచ్చు అని ఈ వీడియో మొదలవుతుంది. ఒక సూపర్ ఆలోచన తో .. నా వాళ్ళు అనుకునే మీ అందరికి..ఫర్ ట్రస్ట్ ఆండ్ వాల్యూ ..అని సదరు సంస్థ గురించి సూపర్‌స్టార్ వివరించాడు.

మీ ఫ్యూచర్ కి మీరే సూపర్‌స్టార్ అని మహేష్ చెప్పడం తో ఈ ఆడ్ ని మహేష్ తనదైన శైలి లో ముగించాడు. మహేష్ మాత్రం మునుపటి కంటే చాలా యుంగ్ గా అందంగా కనిపిస్తున్నడు. ఇది చూసి అభిమానులు ఆనందానికి అవదులు లేకుండా పోయింది.

గడ్డం తో ఎక్కువ పొడవాటి హెయిర్ స్టయిల్ లో సూపర్‌స్టార్ చాలా అందంగా కనిపిస్తున్నడు. ఇక మహేష్ న్యూ లుక్ తో కొత్తగా ట్రెండ్ సెట్ చెయ్యడం యూత్ మొత్తం మహేష్ నే ఫాలో అవుతారనే టాక్ మాత్రం చిత్ర బృందం నుండి వినిపిస్తుంది.

మహేష్ బాబు 25 వ చిత్రం ప్ర‌స్తుతం డెహ్రాడూన్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. న‌రేష్ కూడా కొన్నాళ్లుగా టీంతోనే ఉన్నాడు. నిన్న అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్ డే కావడంతో చిత్ర యూనిట్ అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డేని సెట్‌లోనే జరిపించారు.

మహేష్ బాబు 25వ చిత్రం కి సంబందించిన యూనిట్ న‌రేష్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ పాల్గొన్నారు. బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు ప్రొడక్షన్ యూనిట్ విడుదల చేసాయి. ఈ ఫోటోల్లో మహేష్ తో పాటు, వంశీ పైడిపల్లి, పూజా హెగ్డే, డాన్స్ మాస్టర్ రాజు సుందరం ఇంకా దిల్ రాజు సోదరుదు శిరీష్ ఉన్నారు.

Share

Leave a Comment