పండుగ ను మీరూ వీక్షించండి

సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మహేష్‌ బాబు మైనపు బొమ్మని ఉంచనునున్నారు అనే సంగతి తెలిసిందే. ఈ బొమ్మని ఈ రోజు హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో మహేష్‌ అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. మొత్తానికి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు తయారు చేసిన మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని మరి కొద్ది సేపట్లో ‘ఏ ఎమ్ బి’ సినిమాస్ ప్రాంగణంలో ఆవిష్కరించనున్నారు. ఆ తరవాత ఈ బొమ్మను మళ్లీ సింగపూర్‌కు తీసుకెళ్తారు. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్ లో చూడండి..

అభిమానుల సౌకర్యార్ధం ఈ కార్యక్రమం మొత్తాన్ని మహేష్ బాబు అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటిలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. సో మీరు కూడా చూడాలనుకుంటే మహేష్ ట్విట్టర్ లోనైన, ఫేస్ బుక్ పేజి లోనైన లేదా మహేష్ బాబు యూట్యూబ్ చ్యానెల్ ని అయినా ఓపెన్ చేసి చూడండి.

సాధారణ అభిమానుల సందర్శించడానికి వీలుంటుందా లేదా అనే ప్రశ్న కు మహేష్ సతీమని నమ్రత గారు నిన్న క్లారిటీ ఇచ్చారు. ఒక అభిమాని అడిగిన ప్రశ్న కు ఆవిడ అభిమానులందరూ ఎటువంటి ఎంట్రీ ఫీ లేకుండా తమ అభిమాన హీరో ప్రతిమ ని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత నుండి చూడొచ్చు అని రిప్లై ఇచ్చారు.

మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం నుంచి మైనపు బొమ్మని అభిమానుల కోసం తీసుకురావడం మేడమ్ టుస్సాడ్స్ చరిత్రలోనే తొలిసారి. అంతే కాకుండా మేడమ్ టుస్సాడ్స్ వారు సింగపూర్ లో కాకుండా బయటి ప్రాంతంలో ఇంత గొప్ప కార్యక్రమం చేయడం కూడా వారికిదే మొదటిసారి.

నేషనల్ మీడియా, స్థానిక మీడియాతో పాటు ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున హాజరు అయ్యినట్టు తెలుస్తుంది.. ఇదో అరుదైన సందర్భం కాబట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. మహేష్ మైనపు విగ్రహాన్ని ఏఎంబీ సినిమాస్ లో లాంచ్ చేయడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏఎంబీ మాల్ కి గుర్తింపు దక్కనుంది.

ఇప్పటికే ఏఎంబీ మాల్ లో మైనపు విగ్రహావిష్కరణ నేపథ్యంలో అభిమానులకు ఓ కాంటెస్ట్ ని రన్ చేశారు. అందులో నెగ్గిన వారి నుంచి ఫిల్టర్ చేసి ఫైనల్ గా ఓ ఐదుగురికి మాత్రం మహేష్ తో పాటు వేదికను షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.. వీరికిఈ కార్యక్రమం సందర్భంగా మహేష్ బహుమతులు అందజేస్తారు.

ఇకపోతే టాలీవుడ్ లో ఒక్క మహేష్ బాబుకు మాత్రమే ఈ గౌరవం దక్కడంతో సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మేడమ్ టుసాడ్స్ అది ‘బాహుబలి విగ్రహం’ ఉన్నప్పటికీ అది కేవలం ఆ చిత్రం లోని రోల్ కి సంబందించినది.. కానీ మహేష్ బాబు విషయానికి వస్తే మాత్రం మహేష్ పోషించిన పాత్రకు సంబంధించినది కాదు.. స్వయంగా మహేష్ దే..

సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’ నుండి మరో అప్‌ డేట్‌ వచ్చింది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ ను మార్చి 29న విడుదల చేస్తామని మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు. పాట అద్భుతంగా ఉండబోతుంది.

Share

Leave a Comment