అదిరిపోయిన లుక్ టెస్ట్.!

విలక్షణ నటనతో విభిన్నమైన చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మేజర్. ముంబై అటాక్స్ లో ప్రజలను కాపాడి వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది

ఇప్పటికే విడుదలైన పోస్ట‌ర్స్ సినిమాపై ఆసక్తిని రేపాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ వీడియోను సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేశాడు. అలాగే మేజర్ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విసెష్ తెలియజేశాడు మహేష్

ఈ వీడియోలో మేజర్ సినిమా ఎలా మొదలైంది లుక్ టెస్ట్ ఎలా జరిగింది అనే విషయాల‌ను వెల్లడించారు. మేజర్ సందీప్ ప‌దేళ్ల నుంచి నా మైండ్ లో ఉన్నారు. ఆయ‌న లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాని ఆయ‌న పేరెంట్స్‌ని కాంటాక్ట్ చేసే ధైర్యం ఎప్పుడూ రాలేదు

అయితే మేజర్ లాంటి పాన్ ఇండియన్ స్టోరీ నేను చెప్పగలను అని నాకు నమ్మకం వచ్చినప్పుడు వాళ్ల ఫాద‌ర్‌ని కాంటాక్ట్ చేశాను. మేజ‌ర్ సందీప్ లైఫ్ స్టోరీ చేయ‌డానికి వారి పేరెంట్స్ నుంచి అంగీకారం వచ్చింద‌ని ఆ తర్వాత గ్రాండ్ గా ఈ సినిమా తీయాలని నిర్మించుకున్నాను

అలాగే మహేష్ బాబు గారు మరియు సోని సహకారంతో తెలుగు హిందీ భాష‌ల‌లో ఆయ‌న లైఫ్ స్టోరి చెప్పాల‌నే ఉద్దేశ్యంతో గూఢ‌చారి డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్‌ని తీసుకొచ్చి ఆయ‌న‌తో డైరెక్ట్ చేయించ‌డం జ‌రిగింది. ఆయన లైఫ్ గురించి ఆలోచిస్తుంటే ఒక ఫిలాస‌ఫి గుర్తొచ్చింది

మనం చేయాలనుకున్న పని మీద నమ్మకం ఆ పని చేసేటప్పుడు మన సిన్సియారిటీ ఇవి రెండూ మేజర్ సందీప్ లక్షణాలు. ఇవి నమ్ముకుంటే చాలు అని లుక్ టెస్ట్ కి వెళ్లి ఆయ‌న స్పిరిట్‌ని నాలో నేను వెతుక్కుని మేజర్ సందీప్ గా ఓ ఫోటో దిగా అంటూ ఒక ఫోటోని రివీల్ చేశాడు అడివిశేష్

అందులో మేజర్ సందీప్ హాఫ్ పేస్ కి మేజర్ రోల్ చేస్తున్న శేష్ హాఫ్ పేస్ ను అతికించి ఆసక్తికరంగా చూపించారు. దీనికి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫోటోను ఎలివేట్ చేసే విధంగా ఉంది. మేజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు

మరో పక్క మహేష్ బాబు సపోర్టు ను కూడా కొనియాడరు అడివి శేష్. ఎప్పుడూ సూపర్‌స్టార్ కొత్తదనాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. అలానే మాకు కూడా చాలా మంచి సహకారాన్ని అందించారు. మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాము అంటూ ధన్యవాదాలు తెలిపుతూ ట్వీట్ చేసారు

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్‌ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటించనున్నారు. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ బాబు దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా
ఉన్నట్టు తెలుస్తుంది

పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించనుంది. పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా సర్కారు వారి పాట చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది

Share

Leave a Comment