అమెరికా టు పొల్లాచ్చి!

ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఎక్కడున్నారు? యాడ్‌ షూటింగ్‌ కోసం అమెరికా వెళ్లారు. మరి.. సినిమా షూటింగ్‌లో ఎప్పుడు జాయిన్‌ అవుతారు? అనే క్వొశ్చన్‌కు ఆన్సర్‌ కావాలంటే మేటర్‌ కంటిన్యూ చేయండి.

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్‌ అనే నేను… ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఈ సినిమాలో మహేశ్‌బాబు సీయంగా నటిస్తున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతిపక్ష నేతగా పోసాని నటిస్తుండగా, మహేశ్‌ సెక్రటరీగా బ్రహ్మాజీ యాక్ట్‌ చేస్తున్నారన్నది ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో ఇటీవలే సీయం చాంబర్‌ సీన్స్‌ను కంప్లీట్‌ చేశారు. అమెరికా నుంచి మహేశ్‌ రిటర్న్‌ అయిన వెంటనే నెక్ట్స్‌ షెడ్యూల్‌ పొల్లాచ్చిలో స్టార్ట్‌ కానుందట.

అక్కడ కొన్ని ఫైట్‌ సీన్స్‌ని తెరకెక్కిస్తారట. అన్నట్లు ఇంకోమాట.. ఈ సినిమాలో హోలీ ఫెస్టివల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సూపర్‌ ఫైట్‌ ఉంటుందట.

ఈ ఫైట్‌ థ్రిల్‌కు గురి చేసే విధంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రనిర్మాత దానయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌ – కొరటాల శివ కలిసి చేస్తున్న చిత్రమిది. ఈ సినిమా కొర‌టాల మార్క్ యాక్ష‌న్‌, మెసేజ్ ఉన్న చిత్రంగా తెర‌కెక్కుతోంది. మహేష్‌ కనిపించే విధానం, ఆయన నటన ప్రత్యేకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది.

అభిమానుల అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రం లో కియారా అలీ అద్వాని కథానాయిక. రవి కె. చంద్రన్‌ ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు.

మ‌హేష్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ‘పోకిరి’ కూడా ఏప్రిల్ నెల‌లోనే రిలీజైంది. మ‌రి ‘పోకిరి’ మ్యాజిక్ ఈ సినిమాకి కూడా రిపీట్ అవుతుందేమో చూడాలి.

– సాక్షి దిన పత్రిక

Share

Leave a Comment