అందుకే న్యూ లుక్ లో కనిపించనున్నారు

సూపర్‌ స్టార్ మహేష్ బాబు అద్భుతమైన నటుడిగా అందరి నుండి ప్రసంశలు అందుకున్నారు. సాహసాలు చేయడంలో వెనుకడుగువేయరు. ప్రయోగాత్మక కథల్లోనూ నటిస్తుంటారు. టాలివుడ్ కి ఓవర్సీస్ మార్కేట్ ని ఓపెన్ చేసి తను సెలెక్ట్ చేసుకునే కథలతో ఎల్లప్పుడూ స్పెషల్ వన్ గా నిలుస్తాడు.

కానీ లుక్ విషయంలో ఎక్కువ ప్రయోగాలు చేయరు అని మాత్రమే ఇప్పటి వరకు ఒక రిమార్క్ ఉండేది. అయితే ఆ లోటుని తన 25 వ చిత్రం ద్వారా తీర్చనున్నట్లు తెలుస్తుంది. మహేష్ తన 25వ సినిమా కోసం డిఫరెంట్ ఛేంజోవర్ కోసం ట్రై చేస్తున్నాడు. “టక్కరి దొంగ” అనంతరం మహేష్ బాబు గెడ్డం లుక్ లో కనిపించబోయేది ఈ సినిమాలోనే.

ఈ సినిమాలో మహేష్ బాబు స్టూడెంట్‌గా కనిపిస్తారని సమాచారం. ఆ పోర్షన్‌ కోసమే మహేష్ బాబు న్యూ లుక్ లో కనిపించనున్నారు అని వినికిడి. అయితే ఈ వార్తలు నిజమో కాదో తేలాలంటే అధికారిక ప్రకటన వెలువడే వేచి చూడాల్సిందే. కొత్త షెడ్యూల్ డెహ్రాడూన్‌లో జూన్‌ 17న స్టార్ట్‌ కానుందట.

డెహ్రాడూన్‌ అవుట్‌స్కర్ట్స్‌లో ఓ మూడు రోజులు షూటింగ్‌ జరిపి, 21 నుంచి డైరెక్ట్‌గా కాలేజ్‌కి షిఫ్ట్‌ అవుతారట చిత్రబృందం. ఫ్యామిలీ కంటెంట్ ను అందించడంలో మహేష్ కు మంచి గుర్తింపు ఉంది. అలాగే ప్రయోగాలు చేయడంలో కూడా పేరుంది. డిఫరెంట్‌ లుక్‌లో కనిపించేందుకు మేకోవర్ అవుతున్నారని ముందు నుండి ప్రచారం జరిగింది.

ముంబై ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు గెడ్డం లుక్ లో కనిపించిన ఫోటోలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. గెడ్డం తో మహేష్ బాబును చూసిన ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అవధులులేకుండా పోయింది. గెడ్డం లుక్ లో మా రాజకుమారుడు భలే ఉన్నాడు అంటూ కాంప్లిమెంట్స్ ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు.

సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న “సమ్మెహనం” సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు ఈ రోజు మహేష్ హాజరుకానున్నారు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో మహేష్ పాల్గొననున్నారు. అప్పుడు మహేష్ లుక్ రివీల్ అయ్యే ఆస్కారం ఉంది. ఈ రెండు సందర్భాల్లో మహేష్ న్యూ లుక్ ని ఫ్యాన్స్ చూడనున్నారు.

Share

Leave a Comment