వోగ్ ఫొటోషూట్

నేషనల్ మ్యాగజైన్లు అనగానే సహజంగా హిందీ స్టార్లకు, బాలీవుడ్ బ్యూటీలకే ప్రాధాన్యం ఉంటుంది. ఇక కవర్ పేజిలపై దాదాపుగా వారే ఉంటారు. అయితే ఈసారి ప్రఖ్యాత మ్యాగజైన్ వోగ్ వారు సౌత్ పై దృష్టి సారించారు. ఇప్పటికీ వోగ్ అక్టోబర్ కవర్ పేజీపై సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్పెషల్ ఫొటోషూట్ ను వోగ్ అధికారిక ఖాతా ద్వారా షేర్ చేశారు.

1)

2)

3)

4)

5)

6)

మహేష్ ప్రతీ ఫొటోలోనూ లుక్ అండ్ గెటప్ చితక్కొట్టేశాడు. గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ విషయంలో సరిలేరు నీకెవ్వరు అన్న రేంజ్ లో ఈ వోగ్ ఫొటోషూట్ పిక్స్ ఉన్నాయి. మహేష్ ను ఇంత అల్ట్రా మోడ్రన్ గా చూసి చాలా రోజులు అయ్యింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

ఇంతకీ వోగ్ వారు ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే ఆయన నాలుగేళ్ళ వయసులో సినిమాలో నటించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయనకు అడ్డే లేదు. ఇప్పటికి ముప్పైకి పైగా సినిమాల్లో నటించారు. 20 అవార్డులు గెలుచుకున్నారు. ట్విట్టర్ లో 8.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న స్టార్. ఇక ఇన్‌స్టాగ్రామ్ లో 3.6 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఆయన సొంతం.

యాక్టర్, ఫిలాంత్రోపిస్ట్. అందుకే ఆయనను సూపర్ స్టార్ అంటారు. మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకరలు సంయుక్తంగా భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా చాలా ఏళ్ళ విరామం తరువాత విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మహేష్ బాబు కెరీర్ లో తొలిసారి ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు అనిల్. దసరా సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిముషాలకు ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించారు. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Share

Leave a Comment