ఎప్పుడు మొదలైందంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో ఎంత క్లోజ్ గా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బయట ఎంత సూపర్ స్టార్ అయినా కూడా ఇంట్లో అడుగుపెట్టగానే అవన్నీ మర్చిపోతాడు. కేవలం ఒక తండ్రి, భర్త అనే హోదాలో తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు.

ఇక నమ్రతకి మహేష్ అంటే అమితమైన ప్రేమ. పిల్లలంటే ప్రాణం. పిల్లలతో ఎల్లప్పుడూ బిజీగా ఉండే నమ్రత ఇటీవలే ఫ్యాన్స్ తో అస్క్ మీ యువర్ క్వశ్చన్ అనే లైవ్ లో పాల్గొంది. ఈ లైవ్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా ఓపికతో సమాధానం ఇచ్చారు నమ్రత.

ఇక ఈ ఇంటర్వ్యూలో ఫేవరెట్ హీరో అంటే. నవ్వుతూనే భర్త మహేష్ పేరు చెప్పేసింది. అలా సరదా ప్రశ్నలలో మీరు ఏది బాగా వండుతారు? అంటే మ్యాగీ నూడిల్స్ అని. లైఫ్ లో మర్చిపోలేని క్షణాలు మహేష్ తో పెళ్లి. మరి మీ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? అని అడగగా సమాధానమిచ్చారు.

బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో మొదటిసారి మహేష్ బాబుతో నమ్రత కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా జ్ఞాపకాలు తను ఎప్పటికి మరచిపోలేనని చెప్పిన నమ్రత మొదట న్యూజిలాండ్ లో జరిగిన షూటింగ్ ద్వారానే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని చెప్పారు.

ఇక భవిష్యత్తులో మరోసారి మహేష్ బాబుతో నటిస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ఏమో చూడాలి, బహుశా అది జరగకపోవచ్చని అన్నారు. మళ్లీ మహేష్ పూరీల సినిమా ఆశించొచ్చా? అంటే అది కాలం నిర్ణయిస్తుంది. మహేష్ కి కథ నచ్చితే ఎవరితోనైనా తప్పకుండా చేస్తాడు అన్నారు.

ఇక ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు అనే విషయంపై వివరణ ఇస్తూ అన్ని విషయాలు తనకు గుర్తు ఉన్నప్పటికీ ఆ ఒక్క విషయంలో మాత్రం తనకి కాస్త కన్ఫ్యూజన్ ఉందని వివరణ ఇచ్చింది. మరొక ముఖ్యమైన విషయం గురించి కూడా నమ్రత వివరంగా తెలిపింది.

ఇండస్ట్రీలో ఒక రూమర్ ఉంది. మహేష్ బాబు కథల విషయంలో నమ్రతదే పై చేయి అని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మహేష్ ఓకే చేస్తాడని టాక్ ఉంది. అయితే సినిమా కథల సెలెక్షన్స్ విషయంలో పూర్తి నిర్ణయం మహేష్ బాబుదే అని ఒక్క మాటతో నమ్రత ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు.

అయితే పెళ్లి విషయంలో మాత్రం మహేష్ ని చూడగానే మా పేరెంట్స్ ప్రేమలో పడ్డారని చెప్పింది. చివరగా మీ చేతి పై టాటూ గురించి చెప్తారా అంటే టాటూ చూపించి మహేష్ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. టాటూలో మహేష్ గౌతమ్ సితారల పేర్లు రాసి ఉన్నాయి.

దీన్ని బట్టే అర్ధమవుతుంది నమ్రతకి ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో అంటున్నారు నెటిజన్లు. కానీ ఫ్యాన్స్ కోరికలు మాత్రం ఈ లైవ్ ద్వారా బయటపడ్డాయని అంటున్నారు. నమ్రత ఇలా అభిమానులకు దగ్గరగా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు.

Share

Leave a Comment