స్పెషల్ అతిథిగా

ఎన్నో ఏళ్ళ నుంచి తమకంటూ ఓ సొంత భవనం ఉండాలని కోరుకుంటోంది ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’. తాజాగా తమ కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది ‘మా’. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సొంత భవనం నిర్మించేందుకు ‘మా’ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. మా కు సొంత భవనం ఉండాలనే సంకల్పంతో విరాళాల సేకరణకు ప్లాన్ చేశారు.

అయితే ఇందులో భాగంగా ఇటీవల అమెరికాలో మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలిచి గ్రాండ్ గా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమం ద్వారా దాదాపు కోటి రూపాయలు సేకరించినట్టు మా అధ్యక్షుడు శివాజీరాజా అధికారికంగా ప్రకటించారు.

అయితే రెండో విడతగా మరోసారి అమెరికాలో విరాళాలు సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది ‘మా’. అయితే ఈసారి ముఖ్య అథితిగా సూపర్ స్టార్ మహేష్ బాబుని రమ్మని కోరగా వారి కోరికకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అమెరికాలో భారీ షోను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది మా బృందం.

అమెరికాలో సూపర్ స్టార్ మహేష్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే కోటి మించి మహేష్ కలెక్షన్లు రాబడతాడని మా సభ్యులు విశ్వాసంతో ఉన్నారు. అయితే ఈ వేడుక ఏ ఏ తేదీల్లో నిర్వహిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రెండో విడత సిల్వర్ జూబ్లీ వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించి వీలైనంత ఎక్కువ మొత్తాన్ని నిధుల రూపంలో తీసుకురావాలని మా సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తమ టాలెంట్స్‌తో సినీ ప్రియులను మెస్మరైజ్ చేసేందుకు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, హీరోయిన్స్ లైవ్ పెర్ఫార్మెన్సెస్ ఇవ్వనున్నారు. ఈవెంట్‌కు వచ్చే చీఫ్ గెస్ట్‌లను, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు చాలా ప్రోగ్రాంలను డిజైన్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ లో మైలురాయి లాంటి 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిన ఈ చిత్రం డెహ్రాడూన్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించుకుంది. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తికావడంతో తదుపరి షూటింగ్ విదేశాల్లో ప్లాన్ చేశారట.

మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్, రవి అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను దిల్ రాజు, అశ్వనీ దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Share

Leave a Comment