త్వరగా కోలుకోండి అంటూ..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం ఈ వైరస్ భారిన పడుతున్నారు. తాజాగా దర్శక దిగ్గజం రాజమౌళి కి కరోనా వైరస్ సోకింది.

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. కొద్దిరోజులుగా తనకు, తన కుటుంబ సభ్యులకు స్వల్పంగా జ్వరం ఉందని..

దీంతో కరోనా టెస్టులు చేయించుకున్నామని, వచ్చిన కరోనా రిజల్ట్‌లో పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లుగా రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌‌లోనే ఉండి.. వైద్యుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని ఆయన తెలియజేశారు.

అయితే రాజమౌళి కి కరోనా రావడం పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. జాగ్రత్తగా ఉండండి సార్ అంటూ రాజమౌళి కి సూచించారు. మీరూ, మీ కుటుంబ సభ్యులు త్వరగా ఈ మహమ్మారి భారీ నుండి కోలుకోవాలని కోరుకుంటున్నా అని అన్నారు.

సెలబ్రిటీలందరూ రాజమౌళి అండ్ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే సినిమా చేయనున్నారు. తెలుగు సినిమా అభిమానులందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మహేష్ రాజమౌళి సినిమా ఫిక్స్ అవ్వడంతో ఎటువంటి కధ మహేష్ కోసం సిద్ధం చేసారా అని ఇప్పటినుంచే ఊహాగానాలు అందుకున్నాయి. ఈ చిత్రం ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది అని అటు మహేష్ అభిమానులు ఇటు రాజమౌళి అభిమానులు ధీమాగా ఉన్నారు.

అయితే రాజమౌళి కి కరోనా వైరస్ సోకడం పట్ల అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి మాత్రం కరోనా వైరస్ నుండి కోలుకున్న అనంతరం ప్లాస్మా ఇచ్చేందుకు సైతం సిద్దం అయ్యారు. రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం కి ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ 27వ సినిమా త్వరలో సెట్స్ కి వెల్లనుంది. ఈ చిత్రంలో విభిన్నమైన లుక్స్ లో మహేష్ కనిపిస్తాడట. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు.

ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటికంటే ది బెస్ట్‌గా మహేష్ బాబు పాత్ర ఉంటుందట. ఇప్పటికే విడుదలయిన టైటిల్ లోగో ఆండ్ మహేష్ ప్రీ లుక్ కి విపరీతమైన పాజిటివ్ బజ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

Share

Leave a Comment