స్పెషల్ డే!

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న మహేష్ తానే అభిమానిలా మారిపోయి తన అభిమాన వ్యక్తితో ఫొటో దిగి తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

మహర్షి మూవీ గ్రాండ్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి యూరప్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. స్వతహాగా క్రికెట్ కు సూపర్ ఫ్యాన్ అయిన మహేష్ ఇంగ్లండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుండటంతో అక్కడ కుటుంబంతో సహా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే లండన్‌లో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను లైవ్‌లో మహేష్ వీక్షించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ను చూస్తూ సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన విషయం తెల్సిందే. మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు ఇంకా వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. ప్రస్తుతం హాలీడేస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబుకు మరింత సర్ ప్రైజింగ్ గా లెజెండ్రీ క్రికెటర్ ఒకరు తారస పడ్డారు. మహేష్ బాబు ఆయనకు వీరాభిమానట.

ఆయన మరెవరో కాదు. వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం సర్ ఆండీ రాబర్ట్స్‌. ఆండీ రాబర్ట్స్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు మహేష్. ‘ఇది నాకు చాలా గొప్ప అనుభూతి. నేను ఆయనకు వీరాభిమానిని. గొప్ప ఫ్యాన్ మూమెంట్’ అంటూ ట్వీట్ చేశారు. సర్ ఆండీ రాబర్ట్స్‌ ను కలవడంతో ఈ టూర్ మరింత స్పెషల్ అయ్యిందని మహేష్ బాబు పేర్కొనడం జరిగింది.

ఆండీ రాబర్ట్స్ ఎవరో కాదు ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన దిగ్గజ బౌలర్లలో ఒకరు. వెస్టిండిస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మొట్టమొదటి ఆంటిగ్వా ప్లేయర్. వెస్టిండిస్ తరుపున మొత్తం 47 టెస్టు మ్యాచ్‌లాడి 202 వికెట్లు పడగొట్టారు సర్ ఆండీ రాబర్ట్స్‌. టెస్టుల్లో 5 వికెట్లను 11 సార్లు తీశారు. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లను రెండు సార్లు తీశారు. టెస్టుల్లో సర్ ఆండీ రాబర్ట్స్‌ అత్యధిక స్కోరు 61.

ఇక వన్డే విషయానికి వస్తే విండిస్ తరుపున 56 వన్డేలాడి 87 వికెట్లను పడగొట్టారు సర్ ఆండీ రాబర్ట్స్‌. వన్డేల్లో అత్యధిక స్కోరు 37 నాటౌట్. ఆ తరంలో ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్ ఆయన. బ్యాట్స్‌మెన్ ఆయన బౌలింగ్ ఎదుర్కోవడానికి బయపడే వారు. అటువంటి దిగ్గజ బౌలర్ ను కలవడంతో మహేష్ చాలా ఆనందపడ్డారు.

ఇంగ్లాండ్ నుండి తిరిగి రాగానే అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటించబోతున్నారు. మహేష్ బాబు 26వ చిత్రంగా రూపొందబోతున్న ఆ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, జగపతిబాబు కీలక పాత్రలు చేయనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిచనున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ చిత్రం మే 9 న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ బరిలో దూసుకెళుతోంది. నేటితో ఈ సినిమా విడుదలై 37 రోజులు పూర్తయ్యాయి. అంటే ప్రస్తుతం మహర్షి విడుదలై ఆరో వారంలోకి అడుగుపెట్టేసింది అనమాట. అయినా కూడా మహర్షి తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు.

ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. మహర్షి తో సూపర్‌స్టార్ కెరీర్ లో రెండో 100 కోట్ల షేర్ సినిమా ఖాతాలో యాడ్ అయ్యింది. ఇంతకు ముందు భరత్ అనే నేను ఈ ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలుకొటిన మహర్షి ఆరో వారం లో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.

Share

Leave a Comment