బెస్ట్ అంటున్నమహేష్

గడుపుతున్న క్షణాలను ఆనందంగా జీవిస్తేనే అవి గడిచాక అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగులుతాయి అంటున్నారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ కుటుంబానికి స‌మయం కేటాయిస్తుంటాడు మ‌హేష్. వీలు కుదురినప్పుడ‌ల్లా కుటుంబంతో క‌లిసి విదేశీ యాత్ర‌ల‌కు వెళుతుంటాడు.

మహేష్ ఇటీవ‌ల‌ ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్ టూర్‌కు వెళ్లాడు. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం మ‌హేష్ దుబాయ్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ తీసుకున్న ఫోటోల‌ను మ‌హేష్‌, న‌మ‌త్ర ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజ‌గా త‌న కుమారుడు గౌత‌మ్‌తో ఉన్న ఫోటోను మ‌హేష్ తన ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

‘‘నా బెస్ట్‌ బడ్డీతో (బెస్ట్‌ ఫ్రెండ్‌) మంచి టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాను, మేకింగ్ మెమరీస్’’ అంటూ కామెంట్ చేశాడు. కుమారుడిని బెస్ట్‌ బడ్డీ అని సంబోధించడం చూస్తుంటే వీళ్లిద్దరూ తండ్రీ కొడుకల్లా కంటే ఫ్రెండ్స్‌ లా ఉంటారని ఊహించవచ్చు. ఈ ఫోటో మ‌హేష్ అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

మహేష్ బాబు తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియా లో చూసి అభిమానులు చాలా సంతోషపడుతున్నారు.. నమ్రత తన పిల్లలు మరియు మహేష్ ల ప్రతి మూమెంట్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉన్నారు.

గౌత‌మ్‌, సితార చూస్తుండగానే పెద్దగా అవుతున్నారని.. మహేష్ వారసత్వంను నిలుపనున్నారని ఫ్యాన్స్ అందరూ ఆనదంగా ఉన్నారు. సితార కి సోషల్ మీడియా లో స్పెషల్ క్రేజ్ ఉంది. కేవలం మహేష్ అభిమానులే కాకుండా అందరి హీరోల అభిమానులు కూడా సితార మీద ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, నేనొక్కడినే కాంబినేషన్‌ వన్స్‌మోర్‌ రిపీట్‌ కానుందన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో మంచి ఆసక్తి ఏర్పడింది. సుకుమార్ – మహేష్ బాబు కలిసి చేయనున్న ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఎదురు చూస్తున్నారు. నేడు సుకుమార్ జన్మదిన సందర్భంగా మహేష్ సుకుమార్ కి ప్రత్యేకంగా విషేస్ తెలుపుతూ తన నెక్స్ట్ ఫిల్మ్ సుక్కు తోనే అని కంఫార్మ్ చేసారు.

మహేష్ కోసం సుక్కు అదిరిపోయే కథను, స్క్రిప్ట్ ను రెడీ చేశారట. ఈ కథ మహేష్ కు చాలా బాగా నచ్చిందని, ప్రాజెక్ట్‌ పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారని టాక్‌. సుక్కూ కథ పూర్తి స్థాయి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పనులు మొదలెట్టారని సమాచారం. కొత్త కథ తో తనదైన శైలి లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా పక్కగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సుక్కు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలోనే కాకుండా ఇతర సినిమాల విషయంలో కూడా సోషల్ మీడియా ద్వారా స్పందన తెలియజేస్తూ ఉంటారు. మహేష్ కు ఏ సినిమా అయినా నచ్చితే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘రజని పేట’ సినిమాల పై ప్రశంసల వర్షం కురిపించారు.

భరత్ అనే నేను తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా మహర్షి. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కాబోతున్నది. మహేష్‌ పాత్ర మనసుకి హత్తుకునేలా ఉండబోతోందని, స్నేహం, ప్రేమ, త్యాగం ఈ అంశాల చుట్టూ ఈ సినిమా సాగనుందని సమాచారం. చాలా ప్రేస్టేజియస్‌గా తెరకెక్కిస్తున్నాడు వంశీ పైడిపల్లి.

మాస్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ అందరూ మెచ్చేలా అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయని యూనిట్ నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలో రెండు హయ్యస్ట్ గ్రాసర్స్ అందించిన నెలలోనే మరోసారి రాబోతున్న మహేష్ కి.. ‘మహర్షి’ రూపంలో మూడోసారీ ఆ ఫీట్ రిపీట్ అవుతుందేమో చూడాలి.

Share

Leave a Comment