మహేష్ – రణవీర్ న్యూ ఫోటోగ్యాలరి..

థ‌మ్సప్ హిందీ వెర్షన్ లో యాక్ట్ చేసిన రణవీర్ మరియు తెలుగు వెర్షన్ లో యాక్ట్ చేసిన మహేష్ ఇద్దరు కలిసి ఫొటోల కోసం సరదాగ ఫోజ్ ఇచ్చారు.

`నెవ్వ‌ర్ గివ్ అప్ ఎవ్వ‌ర్‌!` అంటూ మ‌హేష్ విసిరిన ఛాలెంజ్ ఆక‌ట్టుకుంటోంది. యాడ్ చూస్తే.. ఆ రేసింగ్ కారులో.. ఇంటర్నేషనల్ రేసు ట్రాక్ పైన.. మహేష్ ఆ డ్రైవింగ్ సీట్లో.. భలే పర్ఫెక్ట్ ఫిట్ తరహాలో ఉన్నాడు. ఓ కార్ రేసింగ్‌లో పాల్గొన్న మ‌హేష్ కార్ క్రాష్ అయినా.. థ‌మ్సప్ తాగి ల‌క్ష్యాన్ని ఎలా ఛేదించాడు?

పోటీ బ‌రిలో అంద‌రినీ వెన‌క్కి ఎలా నెట్టేశాడు? అన్న‌ది యాడ్. మ‌హేష్ రేస‌ర్ డ్రెస్‌, లుక్ సూప‌ర్భ్ అంటూ ఇదివ‌ర‌కే అభిమానుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్‌ కనిపించే విధానం, ఆయన నటన ప్రత్యేకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది.

ప్రస్తుతం రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, సమాజంలో తలెత్తుతున్న అనేక అరాచకాల పై హీరో ఫైట్‌ చేస్తాడనే సమాచారం చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

Share

Leave a Comment