ఫరెవర్ క్రష్..

మొన్నటి వరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన పేరు నభా నటేష్‌. కానీ ఇస్మార్ట్ షంకర్ సినిమా చూసిన వారికి మేఘనగా మాత్రం గుర్తుండిపోతుంది. కన్నడ సినీ రంగం నుంచి టాలీవుడ్‌కు వచ్చిన నభా సినీ రంగంతో సంబంధం లేకుండానే హైదరాబాద్‌తో తనకు అనుబంధం ఉందంటున్నారు.

ఆమె ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో ఇటీవలే ఒక ఎంటర్‌టైన్మెంట్ వెబ్‌సైట్ తో ముచ్చటించారు. యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు నభా నటేష్‌. మీకు ఎవరి మీద క్రష్ ఉంది ఎవరు అందంగా అనిపిస్తారు ఎవరంటే మీకు ఇష్టం మీకు అని అడగగా ఆమె ఇలా సమాధానమిచ్చారు.

దీనికి మరో మాట లేకుండా మహేష్ బాబు సార్ అనే చెప్తాను. ఆయన నా ఒక్కదానికే కాదు అందరి అమ్మాయిలకి ఫరెవర్ క్రష్. హి ఈజ్ ఎపిటొమ్ ఆఫ్ లుక్స్. ఆయనకి వయస్సు అనేది కేవలం నంబర్ మాత్రమే. రోజు రోజుకి ఎంతో అందంగా తయారవుతున్నారు.

అంతే కాకుండా ఆయన ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ అని ప్రశంసలతో ముంచెత్తింది నభా. ఇది వరకు కూడా తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రాం ఖాతాలో అభిమానులతో ముచ్చటించిన నభా ఒక అభిమాని మహేష్ గురించి ఒక్క మాట లో చెప్పమంటే ఇలా జవాబు ఇచ్చారు.

మహేష్ బాబు గురించి ఒక వర్డ్ లో చెప్తా అని చార్మ్ స్టార్మ్ అని చెప్పారు. ఇదివరకు కూడా ఆమె నటించిన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కూడా నభా నటేష్‌ మహేష్ ను ప్రశంసలతో ముంచెత్తారు. మహేష్ సర్ కి నేను పెద్ద అభిమానిని. మహేష్ సర్ సూపర్ చార్మింగ్.

నేను బెంగళూరుకి చెందిన అమ్మాయిని, ఇక్కడ అందరికి మహేష్ సర్ తెలుసు. ఎవ్రీ గర్ల్ హాస్ ఫాలెన్ ఫర్ మహేష్ సర్. ఆయనంటే ఇక్కడి అమ్మాయిలకు చాలా ఇష్టం. మహేష్ అన్ని సినిమాలని తప్పకుండా చుస్తాను, ఆయన ఫంటాస్టిక్ యాక్టర్ ఆండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్.

తెలుగు సినీ పరిశ్రమకు రాకముందే నేను చాలాసార్లు హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కూడానూ. నా అభిమాన నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. ఇక్కడి వచ్చినప్పుడు అమ్మకు గాజుల కొని తీసుకెళ్లేదాన్ని అని తెలిపారు.

మహేష్‌ కి మాస్‌ నుంచి క్లాస్‌ వరకు, అమ్మాయిలు, ముసలివారు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ అభిమానులు ఉన్నారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, సింపుల్‌గా ఉండే మహేష్‌ కు కేవలం మాములు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీస్ లో కూడా చాలా మంచి ఫాలోయింగి ఉంది.

అందరూ మహేష్ వ్యక్తిత్వాన్ని చాలా ఇష్టపడతారు. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు వచ్చే నూతన నటీమనుల నుంచి వేరే భాష లో నటిస్తున్న అగ్ర హీరోయిన్స్ వరకు అందరికి మన టాలివూడ్ లో సుపరిచితమైన పేరు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ 27వ సినిమా త్వరలో సెట్స్ కి వెల్లనుంది.

ఈ చిత్రంలో విభిన్నమైన లుక్స్ లో మహేష్ కనిపిస్తాడట. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటికంటే ది బెస్ట్‌గా మహేష్ బాబు పాత్ర ఉంటుందట.

Share

Leave a Comment