క్రేజ్ విషయం లో మహేష్ రేంజ్ వేరు..

హిట్లకు ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సినిమా సినిమా కి క్రేజ్ ని పెంచుకునే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ ఒకరు.

మామూలుగా ఎవరికైనా విజయాలు లభించినప్పుడే అలా జరుగుతుంటుంది. కానీ పరాజయాలు కూడా మహేష్‌ స్థాయిని పెంచుతుంటాయి.

ఇప్పుడే కాదు… మొదట్నుంచీ కూడా మహేష్‌ జయాపజయాలతో సంబంధం లేకుండా సత్తా చాటుతుంటారు.

ప్రస్తుతం క్రేజ్ విషయం లో మహేష్ రేంజ్ వేరుగా ఉందని చెప్పాలి. ఒక్క  హిట్ పడితే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సత్తా సూపర్ స్టార్ మహేష్ సొంతం అని చెప్పొచ్చు.

ఇప్పుడు ఇదే విషయాన్నీ నేషనల్ ట్రేడ్ అనలిస్టులు కూడా చెబుతున్నారు.

రీసెంట్ గా కోలివుడ్ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్ళై మరియు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ తో జరిపిన ఇంటర్వ్యూలో అనుకోకుండా మహేష్ క్రేజ్ గురించిన చర్చ జరగగా తరన్ ఆదర్శ్ ఏమాత్రం తడుముకోకుండా బాలీవుడ్ హీరోలకు మహేష్ ఉన్న క్రేజ్ లేదనే చెప్పాడు.

తరన్ ఆదర్శ్ మట్లాడుతూ :

– స్టార్‌ వ్యాల్యూ…ఇండస్ట్రీలో వినిపించే మాట. ఓ అగ్ర నటుడు తన అభినయంతో కథను మరో స్థాయికి తీసుకెళ్లడం అరుదుగా జరుగుతుంటుంది.

– అందులో సూపర్ స్టార్ మహేష్ ప్రధమ స్థానం లో ఉంటారు. వ్యాపారంలో అతని క్రేజ్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.

– స్పైడర్ లాంటి సినిమాతో ఓవర్సీస్ లో 1 మిలియన్ ప్రీమియర్ షో కలెక్షన్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదని అద్భుతం అని చెప్పారు.

– బాలీవుడ్ టాప్ హీరోలు… అమీర్, సల్మాన్ మరియు షారుఖ్ లకు అది లైఫ్ టైం విషయంలోను కొన్ని సార్లే సాధ్యం అయ్యిందని చెప్పారు.

– మహేష్ ఈ స్టార్స్ తో పోల్చితే వేరే లీగ్ లో ఉన్నాడని చెబుతూ సూపర్ స్టార్ ని ఆకాశానికి ఎత్తేశాడు.

గత చిత్రం జయ అపజయాల తో సంబందం ఉండదు, కొత్త సినిమా ఆదాయానికి ఢోకా ఉండదు. ఇదే ఓ స్టార్‌ హీరో సినిమాకు తీసుకొచ్చే విలువ. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇందుకు ఉదాహరణ.

‘భరత్‌ అనే నేను’ సినిమా రూపకల్పన పూర్తి కాకముందే అన్ని ప్రాంతాల్లో భారీ ధరలకు అమ్ముడవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌ హక్కులు చాలా పెద్ద మొత్తానికి అమ్ముడయ్యాయి.

మహేష్‌ చిత్రాల్లోకెల్లా ఇది అత్యధిక ధర కాగా…తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతకు మించిన క్రేజ్‌ కనిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ రికార్డు స్థాయిలో వసూళ్ళు చేసింది.

దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న ‘భరత్‌ అనే నేను’ ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇందులో మహేష్, కియారా, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు పాల్గొంటున్నారు.

Share

Leave a Comment