ఇక షూటింగ్‌తో బిజీ బిజీ

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఫ్యామిలీ కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లకు విదేశాల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఒమ‌న్‌లో మ‌హేష్‌, న‌మ్ర‌త‌, గౌత‌మ్‌, సితార త‌దిత‌ర కుటుంబ స‌భ్యులంతా న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో బిజీగా గడిపారు.

సినిమా సినిమాకి మ‌ధ్య కుటుంబ స‌మేతంగా వెకేష‌న్‌కి వెళ్లి రిలాక్స‌వ్వ‌డం మ‌హేష్ స్టైల్‌. ప‌ది రోజులుగా సాగుతున్న ఈ వెకేష‌న్ ముగించుకుని సూప‌ర్‌స్టార్ ఫ్యామిలీ తిరిగి హైద‌రాబాద్ చేరుకుంది.

మ‌హేష్ ప్ర‌స్తుతం `భ‌ర‌త్ అనే నేను` చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు.

హైదరాబాద్‌లోని శంకర్‌పల్లిలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ సోమవారం ప్రారంభంకాగా ఈ షూటింగ్‌కి మహేష్‌తో పాటు హీరోయన్ కైరా అద్వానీ కూడా హాజరయ్యారు.

సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్ తో దాదాపుగా షూటింగ్ పూర్తయిపోనుందని తెలుస్తోంది. ప్రధాన తారాగణం అంతానటించే కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట.

ఈ సినిమా పూర్తిగా పాలిటిక్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ఇతర అంశాలపైనా డైరెక్టర్ కొరటాల శివ కేర్ తీసుకున్నాడని తెలుస్తోంది.

మహేష్‌బాబు – కొరటాల శివ.. ఈ కాంబినేషన్‌ అనగానే టక్కున గుర్తొచ్చేది ‘శ్రీమంతుడు’. 2015లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

మహేష్, కొరటాల తిరిగి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. రచయితగా, దర్శకుడిగా కొరటాల శివ చిత్రాలు అంతర్లీనంగా సందేశాన్ని కలిగి ఉంటాయి.

మాస్‌, కమర్షియల్‌ అంశాలను టచ్‌ చేస్తూనే అందులో సందేశానికీ ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు ఈ చిత్రంలో ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రకాష్ రాజ్ – శరత్ కుమార్ – రావు రమేష్ – పోసాని కృష్ణ మురళి – దేవరాజ్ లాంటి సీనియర్ నటులంతా వాల్ల పాత్రల్లో అదరగొట్టేస్తారని యూనిట్ నమ్మకంగా ఉంది.

మహేష్ సరసన బాలీవుడ్ నటి కైరా అద్వాని క‌థానాయిక‌గా న‌టిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

వేసవి కానుకగా 2018 ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

కొత్త సంవ‌త్స‌రంలో మ‌హేష్ కెరీర్ ల్యాండ్ మార్క్ అయిన 25వ సినిమా ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్‌- వంశీ పైడిప‌ల్లి-దిల్‌రాజు కాంబినేష‌న్‌లో ఈ సినిమా ఉంటుంది.

అశ్వనీదత్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను 2018 లో షూటింగ్ స్టార్ట్ చేసి అదే సంవత్సరం విడుదల చేయాలనీ మూవీ మేకర్స్ అసలు ప్లాన్.

2018 లో కొరటాల మూవీని, వంశీ మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కాబట్టి 2018లో రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి అని ఖచ్చితం గా తెలుస్తుంది..చూద్దాం ఏమవుతుందో…

Share

Leave a Comment