ఎంతో చూడముచ్చటగా

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబం తో సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

మహేష్ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి నమ్రత. ఈ విషయాన్ని మహేష్ బాబు పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు. గత దశాబ్ద కాలంగా ఈ జంట అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు. టాలీవుడ్లోని ది బెస్ట్ కపుల్స్‌లో వీరూ ఒకరు.

నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయం నమ్రత పోస్టు చేసే విషయాల ద్వారానే బయటి ప్రపంచానికి తెలుస్తుంటాయి. తాజాగా నమ్రత పోస్టు చేసిన ఓ పిక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మహేష్ సెల్ఫీ తీసిన పిక్ అది. ఇద్దరూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. రిలేషన్‌షిప్ గోల్స్ అంటే ఇలా ఉండాలి అని అభిమానులందరూ ఈ పిక్ చూసి తెగ సంబర పడుతున్నారు. వయసు పెరిగిన కొద్దీ మహేష్ అందం రెట్టింపు అవుతుందని వారు కామెంట్స్ చేస్తున్నారు.

నమ్రత సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య మాత్రమే కాదు, ఆయన వెనక ఉండి అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకునే పవర్ ఫుల్ ఉమెన్. మహేష్ బాబు ఫ్యామిలీ, కెరీర్, సేవా కార్యక్రమాలు, ఇతర అంశాలకు సంబంధించిన ప్రతీదానిలోనూ నమ్రత ప్రమేయం ఉంటుంది.

కాస్త గ్యాప్ దొరికినా కూతురు సితార తోనో, కొడుకు గౌతమ్ తోనో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. టాలీవుడ్ లో బెస్ట్ ఫ్యామిలి మ్యాన్ అవార్డులు పోటీ పెడితే మహేష్ టాప్ లో ఉంటాడని చెప్పవచ్చు. వారికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ప్రస్తుతం సూపర్ స్టార్ తన 25వ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇటీవల డెహ్రూడున్ లో షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను దిల్ రాజు – అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా మహేష్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Share

Leave a Comment