సూపర్‌స్టార్ ప్రశంసలు

సాధారణంగా మహేష్ బాబు ఎవరిదైనా సినిమా నచ్చితే ఎవరు చెప్పకపోయినా కూడా ట్విట్టర్ లో ఆ చిత్రానికి సంభందించిన వారిని ట్యాగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తాడు. గతంలో చాలా సినిమాలపై సూపర్ స్టార్ పాజిటివ్ గా స్పంధించిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవల ఒక తమిళ్ మూవీ కూడా నచ్చడంతో వెంటనే ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో మహేష్ ఇంట్లోనే ఉంటూ వివిధ రకాల సినిమాలు వెబ్ సిరీస్ లను చూస్తున్నాడట. మొన్న ఆ మధ్య డార్క్ వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఇక రీసెంట్ గా ఓ మై కడవులే అనే సినిమపై కూడా ప్రశంసలు కురిపించాడు. సినిమా చాలా బాగుంది. నటీనటుల యాక్టింగ్ అలాగే డైరెక్టర్ పనితనం కూడా అద్భుతంగా ఉందని ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా ఆ సినిమాపై తెలుగులో కూడా బజ్ మొదలైంది.

దీంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయిన హీరో హీరోయిన్ డైరెక్టర్ అందరూ తమ ఆనందాన్ని రీ ట్వీట్ చేసి పంచుకున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌కు డైరెక్టర్‌ అశ్వథ్‌ సహా మొత్తం చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. హీరో అయితే నేను మీ అభిమానిని, మీ అభినందలు రావడం నేను ఎప్పటికీ మర్చిపోలేను సర్ అని థాంక్స్ చెప్పారు.

మహేష్ ట్వీట్ పై సినిమాలో హీరోయిన్ గా నటించిన రితికా సింగ్ స్పందించింది. సూపర్ స్టార్ ట్వీట్ చేయడం నమ్మలేకపోతున్నానంది. థ్యాంక్యూ సో మచ్ ఇలాంటి ప్రశంస మీ నుండి రావడం చాలా చాలా సంతోషంగా ఉందంటూ రితికా ట్వీట్ చేసింది.

సూపర్ స్టార్ నుండి ప్రశంస అంటే ఆమాత్రం సంతోషంగా ఉండటం చాలా కామన్ కదా. రితికతో పాటు ఓ మై కడవలే చిత్ర ఇతర యూనిట్ సభ్యులు కూడా మహేష్ ట్వీట్ పట్ల చాలా సంతోషంను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా దీని మీద ఆసక్తి రేపేదే.

ఇప్పటికే ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ లో ఉన్న ఈ సినిమాను ప్రిన్స్ ఫ్యాన్స్ అప్పుడే ఓ లుక్ వేయడం మొదలుపెట్టారు. మరోవైపు సగటు ప్రేక్షకులు సైతం మన సూపర్‌స్టార్ మహేష్ బాబు కే ఇంతగా నచ్చిందంటే గట్టి కంటెంటే ఉందనుకుంటారు.

అందరూ మహేష్ వ్యక్తిత్వాన్ని చాలా ఇష్టపడతారు. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు వచ్చే నూతన నటీమనుల నుంచి వేరే భాష లో నటిస్తున్న అగ్ర హీరోయిన్స్ వరకు అందరికి మన టాలివూడ్ లో సుపరిచితమైన పేరు మహేష్ బాబు.

ప్రస్తుతం మహేష్ 27వ సినిమా త్వరలో సెట్స్ కి వెల్లనుంది. ఈ చిత్రంలో విభిన్నమైన లుక్స్ లో మహేష్ కనిపిస్తాడట. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు.

Share

Leave a Comment