ఆ ఇద్దరి కలయికవో…

సరిలేరు నీకెవ్వరూ చిత్ర ప్రచారం ఊపందుకుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన రాగా ఒక్కో సోమవారం ఒక్కో పాటను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఒక స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్ చేస్తోంది సరిలేరు నీకెవ్వరు టీం.

మైండ్‌ బ్లాక్‌ అంటూ మాస్‌ పాటను పరిచయం చేసిన మహేష్‌ ఇప్పుడు మెలొడీ పాట ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని సూర్యుడివో చంద్రుడివో అనే మెలొడీ పాటను విడుదల చేయనున్నారు. ఈ పాటను గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రాయగా పంజాబీ గాయకుడు, స్వరకర్త బి ప్రాక్‌ ఈ పాటతో తెలుగు శ్రోతల ముందుకొస్తున్నారు.

ఈ పాటకి సంబంధించిన లిరిక్స్ ను దర్శకుడు అనిల్ రావిపుడి ఈ రోజు పోస్ట్ చేస్తూ ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన రామజోగయ్య శాస్త్రి గారికి ధన్యవాదాలు, ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన దేవి కి హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంకెందుకు ఆలశ్యం ఆ లిరిక్స్ ఎంటో మీరు కూడా చుసేయండి మరి.

సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథి వో వారధి వో మా ఊపిరి కన్న కలవో, విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో, సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో.. అంటు ఎంతో అర్ధమంతవైన లిరిక్స్ ను ఈ పాట కి అందించారు శాస్త్రి గారు. అంతకుమించిన ట్యూన్ తో దేవి ఈ పాట ని మరో లెవెల్ కి తీసుకెల్లాడాని సమాచారం.

వీటితో పాటు మహేష్ బాబు కి సంబందించిన కొత్త స్టిల్ ను ఒకటి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటి వరకు మాస్ మహేష్ ని చూపించిన టీమ్ , ఇందులో క్లాస్ మహేష్ ని చూపించారు. ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్న చక్కటి లుక్ లో మహేష్ అదరగొట్టేసాడు. మరింత యంగ్ గా కనిపిస్తూ అందరినీ మెస్మరైజ్ చేసాడు మహేష్.

ఇప్పటివరకు ఎంతో మంది ఉత్తారాది గాయకులను దేవీ శ్రీ టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. అద్నాన్ సమీ, నేహా బాసిన్, మమతా శర్మ, ఫర్హాన్ అక్తర్ వంటి గాయకులకు తెలుగులో తీసుకొచ్చిన దేవీ.. వారి వద్ద నుంచి తెలుగు పలుకులను రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక సరిలేరు నీకెవ్వరు బి ప్రాక్‌ పాడిన రెండో పాటపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

మరి వారి అంచనాలను మించి క్రేజీ సింగర్ ప్రాక్‌తో కలిసి దేవీ సృష్టించిన మ్యాజిక్ ఏమిటో తెలియాలంటే మనమందరం కొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. ఈ సంక్రాంతికి అన్ని హంగులతో ఆల్ క్లాస్ ఆడియన్స్ ఫాన్స్ కి ఫీస్ట్ గా సంక్రాంతి ఎంటర్టైనర్ గా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఉండబోతోంది.

దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో సూపర్ స్టార్ మహేష్ క్యారక్టరైజెషన్, కామెడీ టైమింగ్ హైలైట్స్ గా ఉండనున్నాయి. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే క్యూరియాసిటీ నెలకొంది.

కొంతకాలంగా క్లాస్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో ట్రెండ్‌ మారుస్తున్నాడు. కామెడీతో పాటు మాస్‌ యాక్షన్‌తోనూ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. మహర్షి తరువాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అంచనాలకి తగ్గకుండా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు.

కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్ మాత్రమే కాకుండా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. ఈ సినిమాతో చాలా కాలం తరువాత సీనియర్‌ నటి విజయశాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మునుపెన్నడూ ఏ సినిమాకు లేని విధంగా ఈ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సమాచారం.

Share

Leave a Comment