మొదటి స్థానంలో మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే సరిలేరు నీకెవ్వరు చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి1 కలెక్షన్లను అధిగమించింది.

మహేష్‌ బాబు కు ఉన్న క్రేజ్‌ గురించి అందరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఆయనను అనుసరించే వారి సంఖ్య ఇప్పుడు 9 మిలియన్ కు చేరుకుంది.

దీంతో సౌత్‌ ఇండియాలో 9 మిలియన్ల ట్విటర్‌ ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి నటుడిగా మహేష్‌ నిలిచారు. సౌత్‌ ఇండియా నటుల్లో మహేష్‌ తర్వాత ధనుష్‌కు ట్విటర్‌లో 8.9, సమంతకు 7.8, శృతిహాసన్‌కు 7.5, మోహన్‌లాల్‌కు 5.9, నాగార్జునకు 5.9, రజనీకాంత్‌కు 5.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

2010 సంవత్సరం ఏప్రిల్ నెలలో ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన మహేష్ తన కొత్త ప్రాజెక్టులతో పాటు, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. అలాగే ఇతర నటులకు విషెస్‌ చెప్పడం తో పాటు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు.

తన ట్విట్టర్ ద్వారా అభిమానులకి మరింత దగ్గరగా ఉంటూ తన కొత్త సినిమాల అప్డేట్స్ ను తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు తన సినిమా కాకపోయినా అది మహేష్ ను మెప్పిస్తే దానిని ప్రశంసిస్తూ ట్వీట్లు కూడా వేస్తాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలలో ట్విట్టర్ లో 90 లక్షల ఫాలోవర్స్ ను సాధించిన తొలి నటుడు మహేష్ బాబు.

ఈ నేపథ్యం లో మహేష్ బాబు అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, త్వరలోనే తమ అభిమాన హీరో మహేష్ కోటి మంది ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేయనున్నారని సంబరపడుతున్నారు. 90 లక్షల మంది ఫాలోవర్స్ కు థ్యాంక్స్ అని, ఈ జర్నీ లో పాల్గొన్న ప్రతీ ఒక్కరి ప్రేమ, అభిమానులకు కృతజ్ఞతలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

సూపర్‌స్టార్‌గా ఉన్న మహేష్ బాబుకి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈయన సినిమాలు వస్తే బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. సోషల్ మీడియాలో ఈయనకు ఉన్న ఫాలోయింగ్ చూసి బాలీవుడ్ హీరోలు కూడా బాపురే అంటారు. ఈ విషయంలో సౌత్ ఇండియాలో సూపర్ స్టార్‌ మహేష్ బాబును బీట్ చేసే వారు లేరు.

మొదటి మిలియన్ మార్కు నవంబర్ 2014లో, ఐదవ మిలియన్ మార్కు డిసంబరు 2017లో, ఎనిమిదవ మిలియన్ మార్కు ఆగస్టు 2019లో, ప్రస్తుతం తొమ్మిదో మిలియన్ మార్కు ని మహేష్ 06 మార్చి 2020 వ సంవత్సరంలో సొంతం చేసుకుని సౌత్ ఇండస్ట్రీలోనే ఈ రేర్ రికార్డ్ క్రియేట్ చేసాడు.

సినిమాల విషయానికి వస్తే సరిలేరు నీకెవ్వరు తర్వాత తను చేయబోయే సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు చిరంజీవి–కొరటాల శివ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమాలో మహేశ్‌ ఓ కీలక పాత్ర చేయనున్నట్టుగా సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తుంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Share

Leave a Comment