సూపర్‌స్టార్ బాటలో అభిమానులు

సూపర్‌స్టార్ మహేష్ బాబు కి ఈ పుట్టిన రోజు మరింత స్పెషల్ కానుంది. ఆగష్టు 9 న ఆయన తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఇంకా సమయం ఉన్నా అభిమానులు ముందుగానే ఆయన పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా కొద్దీ రోజుల క్రితం నుండే అభిమాన సంఘాల ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలను ప్రారంభించారు.

ఆయన పేరుతో అన్నదానాలు, వృద్దులకు పండ్లు మరియు వస్తువులు పంపిణీ చేయడం వంటి పనులను చేస్తున్నారు. మహేష్ సోల్జర్స్ చారిటీ వర్క్స్ పేరుతో కొంతమంది సూపర్‌స్టార్ మహేష్ బాబు ఒక సంస్థగా ఏర్పడి చారిటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ సంస్థ మహేష్ దత్తత్త గామమైన బుర్రిపాలెంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

జులై 9న మహేష్ పుట్టిన రోజుకు సరిగ్గా ఇంక నెల రోజుల వ్యవధి ఉంది. ఈ సందర్భంగా బుర్రిపాలెంలో ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహించారు మహేష్ సోల్జర్స్ చారిటీ వర్క్స్ సభ్యులు. మహేష్ అభివృద్ధి చేస్తున్న బుర్రిపాలెం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి చిన్నారులకు స్పోర్ట్ కిట్స్ ను అందజేశారు.

మహేష్ పుట్టిన రోజు ఆగష్టు 9 వరకు ప్రతీ వారం ఒక్కో జిల్లాలో మహేష్ సోల్జర్స్ చారిటీ వర్క్స్ సభ్యులు అంతా కలిసి అక్కడ అన్నదానం, వికాలాంగులకి చేయూత ఇవ్వడం వంటి మంచి పనులు చేయనున్నారు. జులై 15న బెంగలూరు, జులై 20న ఏలూరు, జులై 25న శ్రీకాకుళం, ఆగస్ట్ 4న విశాఖపట్నంలో మహేష్ సోల్జర్స్ చారిటీ వర్క్స్ ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఇలా ఫ్యాన్స్ అంటే కేవలం సినిమాల వరకే పరిమితం కాకుండా సమజానికి పనికొచ్చే పనులు చేయడం అని మహేష్ ఫ్యాన్స్ నిరూపిస్తూ అందరికి ఆదర్శంగా నిలబడుతున్నారు. చేసిన సాయాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుని ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో తాము చేసిన మంచి పనులను కూడా ప్రచారం చేసుకోకపోవడం నిజంగా గొప్ప విషయం. మహేష్ బాబు పంధా లోనే ఇప్పుడు ఫ్యాన్స్ కుడా నడుస్తున్నారు.

సూపర్ స్టార్ కూడా సోషల్ సర్వీస్ చేయడంలో ముందు వరుసలో ఉంటారు. మహేష్ మంచి మనసున్న మనిషి అని అనేక సార్లు నిరూపించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా అయన ఎంతోమందికి సాయం చేశారు. రెండు ఊరులని దత్తత తీసుకొని అక్కడి ప్రజల అవసరాలను తీరుస్తున్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న నిరుపేద పిల్లలకు సహాయం చేసే నిమిత్తం మహేష్ బాబు రైన్ బో హాస్పిటల్ – ఆంధ్ర హాస్పిటల్స్ తో టై అప్ అయ్యారు.

తమ అభిమాన నటుడు అయిన మహేష్ బాబు నుండి తాము ఎంతో నేర్చుకున్నామాని ఫ్యాన్స్ కూడా సమాజానికి తమ వంతు సాయాన్ని చేయాలనే సంకల్పంతో చేస్తున్న ఈ మంచి పనులని అందరు మెచ్చుకునే తీరాలి. ఫ్యాన్స్ అంటే జస్ట్ థియేటర్ దగ్గర హంగామా చేయడానికే పనికొస్తారనేది పాత మాట. ప్రస్తుతం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

Share

Leave a Comment