తిరిగి షూట్ లో జాయిన్ కానున్న మహేష్ బాబు

‘స్పైడర్’ సినిమా జరుగుతున్న సమయం లోనే మహేష్ బాబు కొరటాల శివతో చేస్తున్న ‘భరత్ అనే నేను’ షూటింగ్లో కొన్ని రోజులు పాల్గొన్నారు. ‘స్పైడర్’ సినిమా విడుదల తర్వాత ఆయన గ్యాప్ తీసుకుని కుటుంబంతో కలిసి విదేశాలకు విహారానికి వెళ్లారు. తెలుగు ఇండిస్టీలో మహేష్ బాబు బిజినెస్‌ స్టామినా వేరు. హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా తన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్‌ అవుతాయి.

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ వచ్చే వారం 15 నుండి తిరిగి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు 17 నుండి తిరిగి షూట్లో పాల్గొననున్నారని తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్‌ అనే నేను’లో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో మొదలు కానున్న షెడ్యూల్‌లో మహేష్ పై ముఖ్య సన్నివేశాలు తీయనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సీయం చాంబర్‌ సెట్‌ వేస్తున్నారు.

ఓ ట్వంటీ డేస్‌ బ్యాక్‌ ఈ సిన్మా కోసం ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్‌లో మహేశ్, పోసాని కృష్ణమురళి, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుల గెటప్పుల్లో ఉన్న పలువురు ఆర్టిస్టులు పాల్గొనగా కీలక సన్నివేశాలు తీశారు. తాజా షెడ్యూల్‌లో ముఖ్యమంత్రిగా మహేష్ చాంబర్‌లో పాల్గొనే సన్నివేశాలు తీస్తారన్న మాట.

‘శ్రీమంతుడు’ తర్వాత మహేశ్, కొరటాల కయికలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. రవి కె. చంద్రన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్న చిత్రాన్ని ప్రారంభిస్తారు.

Share

Leave a Comment