మరోసారి మహేష్ ..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ను మరోసారి పంచెకట్టులో చూపించబోతున్నాడట డైరెక్టర్ కొరటాల శివ. ‘భరత్ అనే నేను’లోని ఓ సాంగ్‌లో ట్రెడిషనల్ లుక్ ‌కనిపించబోతున్నాడట ప్రిన్స్.

‘మురారి’ సినిమాలో మహేష్ ను ఓ పాటలో ఆద్యంతం పంచె కట్టులో చూపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.

ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘పోకిరి’లో ‘చూడొద్దంటోన్నా’ సాంగ్‌లో కొద్దిసేపు ప్రిన్స్ చేత లుంగీలో మాసీ స్టెప్స్ వేయించి ఫ్యాన్స్‌ను మైమరిపించాడు.

ఇక ‘శ్రీమంతుడు’లో డైరెక్టర్ కొరటాల ఒక సీన్‌లో మహేష్ బాబుతో లుంగీలో నటింపజేయడమే కాకుండా పంచెతోనే ఓ పాటను కూడా కానిచ్చేశాడు.

ఇక ‘శ్రీమంతుడు’ కాంబినేషన్ లోనే రూపొందుతోన్న ‘భరత్ అనే నేను’ సినిమాలోనూ డైరెక్టర్ కొరటాల మహేష్ తో ఓ సాంగ్‌లో పంచెకట్టుతోనే స్టెప్పులేయించబోతున్నాడట.

ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ‘భరత్ అనే నేను’ చిత్రం ప్రస్తుతం తమిళనాడు కరైకూడిలో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈనెల 25తో తమిళనాడు షెడ్యూల్ పూర్తవుతోందట. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మెస్సేజ్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ బాబు మొదటిసారి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు.

మహేష్ బాబుకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మహేష్ బాబుకు అభిమానులు ఉన్నారు.

ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రచయితగా, దర్శకుడిగా కొరటాల శివ చిత్రాలు అంతర్లీనంగా సందేశాన్ని కలిగి ఉంటాయి.

మాస్‌, కమర్షియల్‌ అంశాలను టచ్‌ చేస్తూనే అందులో సందేశానికీ ప్రాధాన్యం ఇస్తారు. ‘శ్రీమంతుడు’లో కథానాయకుడు ఊరి ని దత్తత తీసుకోవడం అంశాన్ని ప్రధాన ఎలిమెంట్‌గా చూపించారు.

ఇప్పుడు మహేష్‌తో చేస్తున్న ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో ప్రిన్స్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుండగా శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2018 ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

– ఆంధ్ర జ్యోతి దిన పత్రిక

Share

Leave a Comment