మహేష్ కోసం మళ్ళీ దేవి..

మహేష్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. అశ్వనీదత్‌, దిల్‌రాజు నిర్మాతలు. వచ్చే యేడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లబోతోంది.

కథా నాయికగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ దాదాపు ఖాయమైపోయినట్టే. ఇప్పుడు సంగీత దర్శకుడి బెర్తు కూడా నిండిపోయింది. స్వరాలు అందించే బాధ్యతను దేవిశ్రీ ప్రసాద్‌కి అప్పగించినట్టు తెలుస్తోంది.

మహేష్ బాబు- దేవిశ్రీ ప్రసాద్ లది మ్యూజికల్ హిట్ కాంబినేషన్. మహేష్‌ నటించిన ‘1(నేనొక్కడినే)’, ‘శ్రీమంతుడు’ చిత్రాలకు దేవి సంగీతం అందించాడు. రెండు చిత్రాల్లోనూ మంచి పాటలు కుదిరాయి. ‘భరత్ అను నేను’ సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు మరోసారి మహేష్‌ (25వ సినిమా) కోసం దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందివ్వబోతున్నాడన్నమాట.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న‘భరత్ అను నేను’ చిత్రంతో బిజీగా ఉన్నాడు మహేష్‌. ఈ వారమే కొత్త షెడ్యూల్‌ మొదలు కాబోతోంది. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన సెట్‌ని రూపొందిస్తోంది చిత్రబృందం.

ప్రస్తుతం ఈ షెడ్యూల్ కి సంబంధించిన సెట్, మేకింగ్ ప్రాసెస్ లో ఉండటంతో చిన్న బ్రేక్ తీసుకున్న సినిమా యూనిట్, మరో 3 రోజుల తరవాత రెగ్యులర్ షూటింగ్ తో బిగిన్ చేయనుంది.

మహేష్ బాబు ప్రస్తుతం హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఈ నెల 15 నుంచి ‘భరత్ అను నేను’ తాజా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ నెల 17 నుంచి ఈ సినిమా షూటింగులో మహేష్ బాబు కూడా జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది. ఇక షెడ్యూల్ మొద‌ల‌య్యాక ఎలాంటి గ్యాప్స్ లేకుండా ముందు చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తారట‌.

మహేష్ బాబు 25వ సినిమాకి కూడా మ్యూజిక్ అదించే భాద్యత దేవిశ్రీ ప్రసాద్‌కి అప్పగించారారు. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ ను కూడా మొదలుపెట్టనున్నారు.

Share

Leave a Comment