రంగంలోకి దిగిన మహేష్..

కోవిడ్ వలన రోజురోజుకు పరిస్థితి ఇంకా క్లిష్ఠమవుతూనే ఉంది. కరోనాని ఎదుర్కోవడానికి మనమే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జీవనాన్ని కొనసాగించాలి అని పాలకులే డిసైడ్ చేసి అన్నిటికీ అన్ లాక్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగులకు నియమాలు పాటిస్తూ అనుమతులిచ్చేశారు

దాదాపు ఏడు నెలల తరువాత హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా సెట్స్ పైకి వచ్చాడు. ఈ ఏడాది మహేష్ ఇలా సెట్స్ పైకి రావడం ఇదే ఫస్ట్ టైమ్. అయితే ఇది మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ కాదు. ఓ యాడ్ షూటింగ్

బుధవారం గురువారం రెండ్రోజుల పాటు మహేష్ బాబు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఓ వాణిజ్య ప్రకటన కోసం షూటింగ్ లో పాల్గొంటున్నారు. యాడ్ షూట్ కోసం సెట్లో కనిపించిన మహేష్ బాబు లుక్ బయటకి వచ్చింది

ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ ఫోటోని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. షూటింగ్ ప్యాకప్ చేసిన తర్వాత ఈ షాట్ తీసానని చెప్పుకొచ్చాడు. కరోనా బ్రేక్ తర్వాత మహేష్ లుక్ చాలా మారిపోయింది. ఇంతకుముందుకంటే ఇప్పుడు చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు

హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. చూస్తుంటే సర్కారు వారి పాట సినిమా కోసం లుక్ ఛేంజ్ చేసాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే సర్కారు వారి పాట సినిమాలో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే

షూట్ నుండి మహేష్ మరొక ఫోటో కూడా సోషల్ మీడియాలో షికార్ చేస్తోంది. ఈ ఫోటోలో పసుపు చొక్కా బ్రౌన్ ప్యాంటులో తెలుపు స్పోర్ట్స్ షూలతో కనిపిస్తున్నారు. చేతిలో మాస్కు ఉంది. కాఫీ సిప్ చేస్తూ అతను ఒకరితో సంభాషించడం కనిపిస్తుంది

ఇక ఆన్ లొకేషన్ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రకటన నిర్మాణ బృందం పిపిఇ కిట్లు, ఫేస్ మాస్క్ లు, క్రిమిసంహారక శానిటైజర్లు రెడీ చేశారట. సామాజిక దూర నిబంధనల వంటి అవసరమైన అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది

ఇలాంటి సిచ్యుయేషన్ లో మహేష్ సెట్స్ పైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే ఊపులో ఆయన సర్కారువారి పాట సినిమా కూడా స్టార్ట్ చేస్తే చూడాలని ఉందంటూ అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు

కానీ మినిమం క్రూతో సినిమా స్టార్ట్ చేయడం అంత సులువైన అంశం కాదు. కాబట్టి సర్కారువారి పాట సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త టైమ్ పడుతుందా, లేకపోతే ఇదే ఫ్లో లో సినిమా షూటింగ్ కూడా మొదలవుతుందా అనేది తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే

Share

Leave a Comment