సెన్సేషనల్ మాస్ హంగామా

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్‌ వ్యూస్‌ పరంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని మైండ్‌ బ్లాక్‌ పాటను నిన్న సాయంత్రం విడుదల చేశారు.

మైండ్‌ బ్లాక్‌… మైండ్‌ బ్లాక్‌… మైండ్‌ బ్లాక్‌.. బాబూ.. నీ మాస్‌ లుక్కు మైండ్‌ బ్లాకు అంటూ సాగే పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా దేవిశ్రీప్రసాద్‌ హుషారైన బీట్‌తో ట్యూన్‌ చేశారు. పక్కా మాస్ వే లో సాంగ్ ఉన్నది. మహేష్ బాబు ఇలాంటి సాంగ్ చేయడం ఫస్ట్ టైమ్ అనుకోవచ్చు. ర్యాప్ బీట్ తో అదిరిపోయింది.

బ్లేజ్‌, రెనినా రెడ్డి గానం చేసిన ఈ పాటలో మహేష్‌ వాయిస్‌ ఓ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా చెప్పవచ్చు. బాబూ నువ్వు సెప్పు.. వాడ్ని కొట్టమని డప్పు అని లేడీ సింగర్‌ అనగా…నువ్వు కొట్టరా అని మహేష్‌ చెప్పడం కొత్తగా ఉంది. పాట మధ్యలో కూడా రెండుసార్లు ఇలా డైలాగ్స్ రూపంలో మహేష్ బాబు తన గాత్రం అందించడం విశేషం.

మూన్ వాకు మూన్ వాకు పిల్లా నీ నడక చూస్తే మూన్ వాకు.. అర్త్ క్వేకు అర్త్ క్వేకు పిల్లా నువ్వు తాకుతుంటే అర్త్ క్వేకు నీ లిప్పులోనే ఉంది కప్పు కేకు అంటూ ఎక్కువగా ఫన్నీ ఇంగ్లీష్ పదాలతో సాగిన తెలుగు పాట ఇది. మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు అనేది హుక్ లైన్. ఈ పాటకు దేవీ ఒక మాస్ ట్యూన్ అందించగా మంచి జోష్ లో పాడారు.

రాక్ స్టార్ దేవిశ్రీ మరోసారి తానేమిటో ఈ సాంగ్ ద్వారా నిరూపించుకున్నారు. ఫస్ట్ సింగిల్ తోనే మహేష్ బాబు ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేశారు. మరి ఈ సాంగ్ కు తగ్గ స్టెప్పులు ఎలా ఉన్నాయో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే. ఇప్పటికే ఈ లిరికల్ వీడియో రికార్డు వ్యూస్ లైక్స్ తో దూసుకుపోతూ ట్రెండ్ అవుతుంది.

ఇలాంటి మాస్‌ నంబర్స్‌ చేయడంలో సిద్ధహస్తుడైన దేవిశ్రీప్రసాద్‌ మరోసారి ఈ పాటతో తన మార్క్‌ని చూపించారు. ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ బెస్ట్‌ ఇంప్రెషన్‌ అన్నట్టుగా ఐదు పాటలున్న ఈ ఆల్బమ్‌లోని మొదటి పాట ప్రతి ఒక్కరితోనూ డాన్స్‌ చేయించేలా ఉంది. పాటలో దేవి తన మార్క్ ని చూపించాడు. ఇక ఈ నెలలోనే మిగిలిన అయిదు పాటలను కూడా రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ ఏడాది డిసెంబర్ ఎండింగ్, వచ్చే న్యూ ఇయర్‌ వేడుకల్లో కూడా ఈ పాటదే హంగామా అంతా అంటున్నారు ఈ పాటని విన్న అందరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాటతోనే న్యూ ఇయర్‌ సంబరాలు చేసుకుంటారని అంటున్నారు. అంటే ఈ లెక్కన ఈ సాంగ్ ఏ రేంజ్‌లో జనాలని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.

మహేష్‌ను మాస్‌ ఇమేజ్‌లో చూసి చాలా రోజులు అవుతుండటంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అందులోను ఇలాంటి పక్కా మాస్ సాంగ్ జతకట్టడంతో అభిమానులు మరింత ఆనందంగా ఉన్నారు. మహేష్ కెరీర్ లో ఇది మరో బ్లాక్ బస్టర్ రికార్డుగా నిలవడం ఖాయం అన్నట్లుగా ప్రేక్షకులు అంచనాలు పెంచేసుకుంటున్నారు.

ఈసారి పూర్తిగా కమర్షియల్‌ ఫార్ములాకి తగ్గట్టుగా ఎక్కడ ఏది వుండాలో అలా మీటర్‌లో వేస్తూ పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ని సిద్ధం చేస్తున్నాడు రావిపూడి. ఈ మూవీ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు
రావిపూడి పాత్రలు అద్భుతంగా వచ్చేందుకు స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ద చూపించినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండోబోతోందని టాక్. ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ చేసే పోరాటాలు, ట్రయిన్ ఎపిసోడ్, కర్నూలు కొండారెడ్డి బుర్జు సెంటర్ ద‌ృశ్యాలు అబ్బుర పరుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాపై కేవలం మహేష్ బాబు అభిమానులకే కాకుండా యావత్తు సినీ అభిమానులకి భారీగా అంచనాలు ఉన్నాయి

ఈ సినిమా ద్వారా సంగీత, లేడీ అమితాబ్ విజయశాంతి కూడా కొంత గ్యాప్ తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక ముందు నుంచి చిత్ర యూనిట్ ఇంకెలాంటి ప్రమోషన్స్ ప్లాన్ చేసిందో చూడాలి. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Share

Leave a Comment