ఆయన దర్శకత్వంలో నటించడం మోస్ట్‌ మెమొరబుల్‌ – మహేష్‌బాబు

ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడం అన్నది నా కెరీర్‌లోనే మోస్ట్‌ మెమొరబుల్‌ – సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు

spyder-chennai-pressmeet

Scroll down for English Article

టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ భారీ అంచనాలు సంతరించు కున్న స్పైడర్‌ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఆదివారం మద్యాహ్నం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

మహేశ్‌బాబు సహకారంతోనే..

చిత్ర దర్శకుడు ఏఆర్‌.మురగదాస్‌ మాట్లాడుతూ తమిళం, తెలుగు అంటూ ద్విభాషా చిత్రం చేయడం తనకు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. అలాంటిది ఈ చిత్ర కథానాయకుడు మహేష్‌బాబు తన పూర్తి సహకారంతో చాలా సులభం చేశారని పేర్కొన్నారు. మరో నాలుగేళ్ల తరువాత కూడా చూసేలా చిత్రం ఉండాలని ఆయన తనతో అన్నారన్నారు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రీఎంట్రీ అవుతున్నారని అన్నారు.

10 రెట్లు అధికంగా గుండె కొట్టుకుంటోంది:

మహేష్‌బాబు మాట్లాడుతూ స్పైడర్‌ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోందని, అయితే ఇప్పటి నుంచే తన గుండె 10 రెట్లు అధికంగా కొట్టుకుంటోందని అన్నారు. తమిళంలో చిత్రం చేయాలన్న కోరిక చాలా కాలంగా ఉందని, దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ కలిసి స్పైడర్‌ కథ చెప్పడంతో దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ చేస్తే బాగుంటుందని భావించామని చెప్పా రు. మంచి కథ లభిస్తే మళ్లీ తమిళంలో నటిస్తానని మహేష్‌బాబు అన్నారు. స్పైడర్‌ చిత్రం తనకు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని, ఈ చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందని నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. స్పైడర్‌ చిత్రం మహేష్‌బాబు కెరీర్‌లోనే దిబెస్ట్‌ చిత్రంగా నిలిచిపోతుందని నిర్మాత ఎన్‌వీ.ప్రసాద్‌ పేర్కొన్నారు.

టాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌వీ.ప్రసాద్‌ నిర్మించిన భారీ ద్విభాషా చిత్రం స్పైడర్‌. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హారీష్‌జయరాజ్‌ సంగీతం అందించారు. మహేష్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించిన ఇందులో ఎస్‌జే.సూర్య, భరత్‌ ప్రతినాయకులుగా నటించడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళంలో లైకా సంస్థ విడుదల చేయనుంది.

spyder-chennai-pressmeet-1

“I can hear my own heartbeat, with the release in three days. I have worked to my best for this movie. Every director wants to give something new and I started with the same motion and I believe I have managed to do it,” the director said.

He continued on his choice of casting Mahesh in the film, “I have been wanting to work with Mahesh for long. Heroism is very natural when he does it, that’s a quality I really like. We need heroism on screen for a mass film, but the balance is also equally important. My son after fives years shouldn’t ask me why I have done a movie like this. The movie should feel good even after a few years. There is a need to make movies like that and Mahesh is a perfect fit. Making a bilingual is a very challenging task and I have to thank Mahesh for his co-operation.”

When questioned if he would like to collaborate with Tamil superstar Vijay and Mahesh for a project in future, AR Murugadoss replied with much confidence that he is ready for such a film. But he also explained his struggle, “I am ready to make a movie with both Vijay and Mahesh Babu but the screen space should be apt. We don’t know the response we would get if Mahesh Babu has two songs in Tamil and two songs for Vijay in Telugu. But I would be happy to do it.”

Rakul Preet, who is working with both the director and actor for the first time, said that this project is nothing less than a dream come true for her. She said, “I’m really happy to be coming back to Tamil films with this movie. My character is of Charlie, a very clumsy but sweet character.”

Share

Leave a Comment