యూఎస్ లో మొదలైన మహేష్ సినిమా..

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ మూవీ పూర్తవగానే మరో సినిమా కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు.

అది కూడా తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం కావడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మాతలుగా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లోకి ఎంటరైంది.

ఇన్ని రోజులు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న వంశీ పైడిపల్లి చిత్ర పనుల్ని ఇంకాస్త వేగవంతం చేశారు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి.

చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. అది కూడా మన దగ్గర కాదు యూఎస్ లో ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టడం విశేషం. ఈ సిట్టింగ్స్ లో నిర్మాత దిల్ రాజు కూడా పాలుపంచుకుంటున్నారు.

మహేష్ తో చేయబోయే సినిమా కోసం లొకేషన్లు వెదికేందుకు అమెరికా వెళ్లాడు వంశీ పైడిపల్లి. దేవిశ్రీప్రసాద్ ను కూడా వెంట తీసుకెళ్లాడు. అలా ఇద్దరూ కలిసి అమెరికాలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.

ఈ మూవీ కోసం మంచి ట్యూన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఇద్దరూ బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం మొదలుకానుంది.

మహేష్ బాబు- దేవిశ్రీ ప్రసాద్ లది మ్యూజికల్ హిట్ కాంబినేషన్. మహేష్‌ నటించిన ‘1(నేనొక్కడినే)’, ‘శ్రీమంతుడు’ చిత్రాలకు దేవి సంగీతం అందించాడు. రెండు చిత్రాల్లోనూ మంచి పాటలు కుదిరాయి.

‘భరత్ అను నేను’ సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు మరోసారి మహేష్‌ (25వ సినిమా) కోసం దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందివ్వబోతున్నాడన్నమాట.

మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు మహేష్. ప్రస్తుతం మహేష్, కొరటాల సినిమా షూటింగ్ ప్రత్యేకంగా వేసిన సిఎం ఛాంబర్ సెట్లో జరుగుతోంది.

Share

Leave a Comment