నిజంగానే…మనసుకు నచ్చింది

నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొని ఇప్పుడు దర్శకురాలిగా పరిచయమవుతున్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ మంజుల ఘట్టమనేని.

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క అయినప్పటికీ తండ్రి, తమ్ముడి స్టార్ డమ్ ల ఆసరాగా చేసుకొని కాక స్వయంకృషితో ఎదిగిన మహిళ మంజుల ఘట్టమనేని.

నటిగా “షో” సినిమాతో ఆశ్చర్యపరిచిన మంజుల నిర్మాతగా “పోకిరి” చిత్రంతో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇప్పుడు దర్శకురాలిగా “మనసుకు నచ్చింది” అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

ఈ చిత్రం ట్రైల‌ర్‌ని మంగ‌ళ‌వారం మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ప్రామిసింగ్ ఉంద‌ని ప్ర‌శంసిస్తూనే..త‌న సోద‌రికి, చిత్ర బృందంకి విషెస్ తెలియ‌జేశారు మ‌హేష్‌.

ఓ అమ్మాయి, ఓ అబ్బాయిల మ‌ధ్య ఉండే స్నేహ‌బంధంతో పాటు ప్రేమ‌బంధాన్ని కూడా చూపుతూ ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా ఈ సినిమాని తీర్చిదిద్దార‌ని అనిపిస్తోంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. “ట్రైలర్ కి విశేషమైన స్పందన లభించింది. రోమాంటిక్ డ్రామాగా రూపొందిన “మనసుకు నచ్చింది” ట్రైలర్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

రాధన్ సంగీత సారధ్యంలో రూపొంది ఇప్పటివరకూ విడుదలైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి జనవరి 26న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం” అన్నారు.

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్-ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్-పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “మనసుకు నచ్చింది”.

సందీప్ కిషన్-అమైరా దస్తూర్ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫేస్ బుక్/ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సంపాదించుకొన్న “మనసుకు నచ్చింది” చిత్రం జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి, ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ ఆదిత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాధన్,

ట్రైలర్ ఫ్రెష్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకకుల ముందుకు తీసుకురానున్నారు.

Share

Leave a Comment