సూపర్‌స్టార్ గురించి మంజిమా

ప్రేమమ్ తో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు మంజిమా మోహన్. తెలుగులో నాగ చైతన్య తో నటించిన ‘సాహం శ్వాసగా సాగిపో’ ఆమెకు మొదటి సినిమా. మంజిమాకు మలయాళంలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. బాలనటిగా అక్కడ చాలా సినిమాలు చేసిన మంజిమా మోహన్ దక్షిణాది సినీ ఇండస్ట్రీపై కన్నేసారు.

నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు మంజిమా మోహన్. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రాం లో క్వచ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను ఒక దాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు గురించి కూడా కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు మంజిమా.

త్వరలో మహేష్‌బాబు తో నటించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని ఒక అభిమాని మంజిమా మోహన్ ను అడిగాడు. దానికి సమాధానంగా ‘ఐ ఉడ్ లవ్ టు’ అని చెప్పారు మంజిమా మోహన్. మహేష్ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ గురించి అంచనా వేయడం అసాధ్యం ఎందుకంటే ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో మ‌హేష్. అత‌డి ఛరిష్మాకి బాలీవుడ్ అంద‌గ‌త్తెలు సైతం అద‌రాల్సిందే.

మహేష్ అంటే తమకి ఇష్టం అని ఇప్పటికే పలు మార్లు అనేక ఇతర భాషా నటీమణులు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. మహేష్ కి నేషనల్ లెవెల్ లో ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన చార్మింగ్ పర్సనాలిటి నే కాకుండా ఆయన వ్యక్తిత్వం ని అందరు ఇష్టపడతారు. హిందీ బ్లాక్‌బస్టర్ క్వీన్ మలయాళం రీమేక్ జామ్ జామ్‌లో నటిస్తున్నారు మంజిమా మోహన్.

నేను బాల నటిగా సినిమాలు చేశాను. అప్పుడు మా పేరెంట్స్‌ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. కానీ హీరోయిన్‌గా చేస్తానంటే మాత్రం వద్దన్నారు. చదువు పూర్తి చేశాకే ఏదైనా అని కండిషన్‌ పెట్టారు. వారి బలవంతం మీదే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. నా సినిమాలు సాధిస్తున్న విజయం చూసి వారూ హ్యాపీగా ఉన్నారు అన్నారు మంజిమా.

ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. వినాయక చవితి నాడు కూడా షూటింగ్‌ ప్లాన్‌ చేసారు. సో పండగ సెలవు లేనట్లే. నెలాఖరున మరో షెడ్యూల్‌ కోసం విదేశాలు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్‌ 5న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Share

Leave a Comment