అరుదైన రికార్డులు ఎన్నో ఆయన పేరిట ఉన్నాయి…

“300 పైగా సినిమాల్లో హీరోగా నటించిన సూపర్ స్టార్ గా మాత్రమే కృష్ణ గారి గురించి ఇప్పటి జెనరేషన్ కు తెలుసు.

ఇప్పుడిప్పుడే టీనేజ్ లోకి అడుగు పెడుతున్న తరానికి ఆయన మహేష్ బాబు తండ్రి – ఒకప్పటి స్టార్ హీరో అని తెలుసు.

కాని అంతకు మించి ఆయనకున్న గొప్ప వ్యక్తిత్వం గురించి అప్పట్లో ఆయనతో సినిమాలు చేసిన దర్శక నిర్మాతలను అడిగితే తెలుస్తుంది.

నిర్మాతలు ఎవరైనా కష్టాల్లో ఉన్నా – ఇబ్బందుల్లో ఉన్నా తన రెమ్యునరేషన్ అడిగి తీసుకోవడానికి కూడా మొహమాటపడేవారని ఆయనతో సన్నిహితంగా మెలిగినవారు చెబుతారు.

తాను హీరోగా నటించిన సినిమా ఫెయిల్ అయితే పారితోషికంలో కొంత భాగం వెనక్కు ఇవ్వడమో లేదా బాలన్స్ అమౌంట్ ఇవ్వకపోయినా అడగకపోవడమో చేసేవారట.

ఏడాదికి 14 సినిమాలు చేసిన అరుదైన రికార్డులు ఎన్నో ఆయన పేరిట ఉన్నాయి. తెలుగు చిత్ర సీమకు లేటేస్ట్ టెక్నాలజి ని పరిచయం చేసింది కూడా కృష్ణ గారే..

సింహాసనం – మోసగాళ్ళకు మోసగాడు – అల్లూరి సీతారామ రాజు సినిమాలు టేకప్ చేసినప్పుడు బయటి నిర్మాతలు అయితే సినిమా ఫ్లాప్ అయితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్ని తన బ్యానర్ మీదే నిర్మించుకున్నారు ఆయన.

ఇప్పుడు తరం మారింది. మహేష్ బాబు సూపర్ స్టార్ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాని కృష్ణ గారిలా ఈ జనరేషన్లో సంవత్సరంలో అన్ని సినిమాలు ఎవరూ చేయలేరు.

నాన్నగారు అప్పట్లో మొహమాటానికి కూడా కొన్ని సినిమాలు చేసారని – తనకు ఎంత రిస్క్ అయినా ఫ్యామిలీని వదిలేసి మరీ డే అండ్ నైట్ షిఫ్ట్ వర్క్ చేసేవారని..

కాని మహేష్ కాని తాను కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా ఉండలేమని – బాగా ఎగ్జైట్ చేస్తే తప్ప లేదా నచ్చితే తప్ప ఎవరికి మాట ఇచ్చే పరిస్థితి లేదన్నారు”- మహేష్ సోదరి ‘మనసుకు నచ్చింది’ దర్శకురాలు మంజుల.

మంజుల మాటల్లో నిజం లేకపోలేదు. సినిమా నిర్మాణం రోజురోజుకి కత్తి మీద సాములా మారుతున్న తరుణంలో అగ్ర హీరోలకు ఏడాది ఒక్క సినిమా చేయటమే యుద్ధంగా మారింది.

అలాంటిది కృష్ణ గారిలా అన్ని సినిమాలు ఒప్పుకుని వరసబెట్టి చేసుకుంటూ పోయే పరిస్థితి లేదు. ఇది ఏ స్టార్ హీరో అయినా మహా అయితే సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తే గొప్ప అనే దాకా వచ్చింది.

Share

Leave a Comment