ముఖ్యమంత్రి భరత్‌తో మంత్రి కేటీఆర్

మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను ప్రస్తుతం సమాజ పరిస్థితులను, రాజకీయ వ్యవస్థను ప్రశ్నించేలా అద్భుతంగా ఉంది. సినిమాలో ఉన్న బలమైన కంటెంట్ దృష్ట్యా అన్నివర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ సినిమాను తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు చిత్రబృందం ఏర్పాటు చేసిన స్పెషల్ షో ద్వారా వీక్షించారు. ఈ షోకు మహేష్ బాబు, కొరటాల శివ, నిర్మాత డీవీవీ దానయ్యలు హాజరయ్యారు. సినిమా చూశాక కేటీఆర్ మాట్లాడుతూ మంచి సినిమా తీశారని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

తను భరత్ అనే నేను చూసిన విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ‘మీ అందరికి ఒక సర్ ప్రైజ్ ఉంది. నా స్నేహితుడు మహేష్ మరియు కొరటాల శివ తో ఇప్పుడే భరత్ అనే నేను చిత్రం గురించి చర్చలో పాల్గొన్నాను. వ్యక్తిగతంగా భరత్ అనే నేను ను చాలా ఎంజాయ్ చేశాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి, ‘భరత్ అనే నేను’ సినిమాను చూసినందుకు, తమ ప్రయత్నాలను ప్రశంసించినందుకు మీకు ధన్యవాదాలు అని మహేష్ తెలిపారు. మా సినిమా సక్సెస్ కు సంబంధించిన సెలబ్రేషన్స్ కు మీరు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సొంతం చేసుకొంటున్నది భరత్ అనే నేను. ఇప్పటికే 125 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత కూడా అదిరిపోయే వ‌సూళ్లు రాబ‌డుతోంది.

ఇక అమెరికాలో మహేష్ ప్రభంజనం మామూలుగా లేదు. ఆస్ట్రేలియాలో ‘భరత్ అనే నేను’ ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో పద్మావతి తర్వాతి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అక్కడ తెలుగు సినిమాల ఫుల్ రన్ రికార్డులు ఆల్రెడీ బద్దలైపోవడం విశేషం.

గల్ఫ్ దేశాల్లో కూడా మహేష్ సినిమా జోరు చూపిస్తోంది. తిరుగులేని వసూళ్లు సాధిస్తోంది. మొత్తానికి బౌండరీ అవతల మహేష్ బ్యాటింగ్ మామూలుగా లేదు. ఇక ఫుల్ స్వింగ్‌లో ఉన్న భ‌ర‌త్ రూ.200 కోట్ల మార్క్ సులువుగా చేరుకుంటుంద‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు.

Share

Leave a Comment