మరోసారి రుజువు చేసిన మహేష్

తమిళ స్టార్ హీరో విజయ్, మురుగదాస్ కాంబోలో శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘సర్కార్’. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించారు. ఈ సినిమా మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ సినిమా గురించి చాలా పాజిటివ్‌గా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ ట్వీట్‌ కి మురుగదాస్ రిప్లై ఇస్తూ ‘సార్, మీకు చాలా ధన్యవాదాలు. మీకు నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు నచ్చడమంటే ఇట్ మీన్స్ ఏ లాట్’ అని ట్వీట్ చేశారు.

అంతకుముందు మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ‘సర్కార్’ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షల్ని తెలియజేశారు. ‘సర్కార్ ఎంగేజింగ్ పొలిటికల్ డ్రామా. నిజంగా ఈ సినిమాను నేను బాగా ఎంజాయ్ చేశాను. దర్శకుడు మురుగదాస్ ట్రేడ్ మార్క్ మూవీ’ అంటూ చప్పట్ల ఎమోజీతో ప్రశంసలు కురిపించారు మహేష్ బాబు.

ఇదిలా ఉంటే మహేష్, మురుగదాస్ కాంబోలో గత ఏడాది భారీ అంచనాలతో విడుదలైన విడుదలైన ‘స్పైడర్’ మహేష్ అభిమానుల్ని నిరాశ పరచింది. ఈ తరుణంలో తనను నిరాశ పరిచినా ఆ దర్శకుడి మరో సినిమాను ప్రశంసిస్తూ మహేష్ ట్వీట్ చేయడం ద్వారా దటీజ్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు మహేష్ బాబు.

అది కూడా సర్కార్‌కి ఏమంత గొప్ప టాక్ రాలేదు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ట్వీట్ చేసి తాను ఈగో లెస్ సూపర్ స్టార్ ని అని మరో సారి ఋజువు చేసుకున్నారు మహేష్ బాబు. ఇది సూపర్‌స్టార్ మంచితనానికి నిదర్శనమని అభిమానులు చెప్తున్నారు.

నిజమే మరి ఎంత మంచితనం కాకపోతే మహేష్ అలా ట్వీట్ చేస్తాడు చెప్పండి. దర్శకులకు మహేష్ ఎంత విలువ, గౌరవం ఇస్తాడో దీంతో ఇంకోసారి ఋజువు అయ్యింది. ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ ‘మహర్షి’. ఈ మూవీ కోసం యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూపర్‌స్టార్ మహేష్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Share

Leave a Comment