గంగవ్వ టీమ్ తో సందడి

యూట్యూబ్‌ సెన్సేష‌న్‌గా మారిన మై విలేజ్ షో గంగ‌వ్వ గురించి అందరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెల్ల‌మెల్ల‌గా వెండితెర‌పై కూడా ఈ బామ్మ ఓ వెలుగు వెలిగేందుకు స‌న్న‌ద్ధ‌మవుతుంది. ఇటీవ‌ల ఇస్మార్ట్ శంక‌ర్, మల్లేశం తదితర చిత్రాల్లో నటించింది. యూట్యూబ్‌లో గంగవ్వకు ఉన్న ఫాలోయింగ్ చూసి సినీ దర్శక నిర్మాతలుతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్ చేయిస్తున్నారు.

యూట్యూబ్‌లో గంగ‌వ్వ కామెడీల‌కి విపరీతమైన రెస్పాన్స్ వ‌స్తుంది. అచ్చ తెలంగాణ‌లో ముక్కుసూటిగా మాట్లాడే గంగ‌వ్వకి ప్ర‌తి ఒక్క‌రు బాగా క‌నెక్ట్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో సినీ ప్ర‌ముఖులు కూడా ఆమెతో మూవీ ప్ర‌మోష‌న్ చేయించుకుంటున్నారు. ఆ మ‌ధ్య ఓ బేబి సినిమా ప్ర‌మోష‌న్ కోసం గంగ‌వ్వ స‌మంత‌ని ఇంట‌ర్వ్యూ చేసింది. ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఫన్నీ ఇంట‌ర్వ్యూ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

ఇక తాజాగా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర బృందం గంగవ్వ మై విలేజ్ షో టీంతో సందడి చేసింది. స‌రిలేరు నీకెవ్వ‌రు ప్ర‌మోష‌న్‌లో భాగంగా గంగవ్వ టీం చిత్ర బృందాన్ని క‌లిసింది. కలిసినట్టూ సమాచారం. వీరు కలిసి ఎటువంటి కొత్త రకమైన ప్రమేషన్ ప్రోగ్రాం చేసారో ఇంక తెలియాల్సి ఉంది. కాని ఇలా విన్నూతనమైన ప్రమోషన్స్ ని సరిలేరు నీకెవ్వరు టీం చేపట్టడం చూసి అభిమానులు ఎంతగానో హర్షిస్తున్నారు.

మూవీ ప్ర‌మోష‌న్ కోసం స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర బృందం ను కలిసిన మై విలేజ్ షో టీంని అక్కడ వారితో కొన్ని పిక్స్ దిగి అవి అభిమానులకోసం షేర్ చేసారు. ఇందులో మహేష్ బాబు, విజయశాంతి, రాజేంద్ర‌ప్రసాద్‌, దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.

మ‌హేష్‌, విజ‌య‌శాంతి, రాజేంద్ర‌ప్రసాద్‌, అనీల్‌రావిపూడితో క‌లిసి ఫోటోలు దిగారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోస్ లొ మహేష్ మరింత అందంగా కనిపిస్తున్నాడు. రోజు రోజు కి మహేష్ రివర్స్ ఏజింగ్ పద్ధతిలో వెల్తున్నాడు అని, మునుపటీ కంటే ఎంతో యంగ్ గా కనిపిస్తున్నాడని నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లను ప్రారంభించిన చిత్ర యూనిట్.. అందులో భాగంగా గత సోమవారం మైండ్ బ్లాక్ సాంగ్ ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట పెద్ద సంచలనంగా మారింది. ఊర మాస్ టచ్ తో ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది ఈ సాంగ్.

ఫాన్స్ ఎదురు చూస్తున్న సెకండ్ సాంగ్ సూర్యుడివో చంద్రుడివో సోమవారం సాయంత్రం 5:04 కి విడుదల అయింది. రాక్ స్టార్ దేవి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత గానో ఆకట్టుకునే ఒక సోల్ ఫుల్ మెలోడీ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఎంతో అర్ధమంతవైన లిరిక్స్ తో చాలా అద్భుతంగా ఈ పాట ని రామజోగయ్య గారు వ్రాసారు.

కొంతకాలంగా క్లాస్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో ట్రెండ్‌ మారుస్తున్నాడు. కామెడీతో పాటు మాస్‌ యాక్షన్‌తోనూ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం భారీగా హైప్‌ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా సూపర్‌ స్టార్‌ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే తీసుకువస్తుందంటున్నారు చిత్రయూనిట్‌.

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న విడుదల కానుంది. చిత్రంలో మహేష్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండోబోతోందని టాక్. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మునుపెన్నడూ ఏ సినిమాకు లేని విధంగా నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సమాచారం.

Share

Leave a Comment