అదే నా ఫేవరెట్ అంటున్న చైతన్య

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ శైలజారెడ్డి అల్లుడు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా విడుదల అవనుంది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కాసేపు అభిమానులతో ముచ్చటించారు చిత్ర హీరో నాగచైతన్య. అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు చై.. సమాధానాలు చెప్పాడు. తనకి ఇష్టమైన సినిమా గురించి కూడా ఈ క్వశ్చన్ సెషన్ లో తెలియజేసాడు.

ఇందులో భాగంగా మహేష్ బాబు సినిమాల్లో మీకు ఫేవరేట్ సినిమా ఏంటని అభిమానులు నాగచైతన్యని అడిగారు. వెంటనే ఆ ప్రశ్నకి ‘పోకిరి’ నా ఆల్ టైం ఫేవరేట్ సినిమా అని సమాధానం ఇచ్చాడు చైతన్య. పోకిరి సినిమా నచ్చనివారు ఎవరుంటారు? నాగ చైతన్య కూడా అదే బెస్ట్ మూవీ అని సమాధానం ఇవ్వడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేసారు.

పోకిరి ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చిత్ర సీమకి కొత్త బెంచ్‌మార్క్ స్రుష్టించిన చిత్రం. కేవలం తెలుగు లోనే కాదు ఈ సినిమా పర బాషల్లో కూడా ఎంతోమంది కెరియర్ ని నిలబెట్టింది. తమిలం లో విజయ్, హిందీ లో సల్మాన్ ల కెరియర్ కు మరింత మైలేజి పెంచింది.

ప్రభుదేవా కూడా ఈ మధ్య ఇంటర్వ్యూ లో ‘నేను బాంబే వెళ్ళి అంత పెద్ద డైరెక్టర్ ను అయ్యానంటే తెలుగు ఇండస్ట్రీ వల్లే. మీకందరికి తెలుసు మహేష్‌బాబు ‘పోకిరి’ వల్లే నేను అంత పెద్ద డైరెక్టర్ ని అయ్యాను. అందుకే హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది’ అని చెప్పారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ‘మహర్షి’తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సుకుమార్ సినిమా లాంచ్ అవుతుంది. మరి సెట్స్‌కు వెళ్లకముందే భారీ ప్రణాళికలు రచిస్తోన్న సుకుమార్, ప్రిన్స్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నాడో చూడాలి.

Share

Leave a Comment