వెంటనే ఫోన్ చేస్తాడు

టాలీవుడ్ లో ఎవర్‌గ్రీన్ మన్మధుడు కింగ్ నాగార్జున. వైవిధ్యమైన రోల్స్ ఎంచుకుంటూ, సరికొత్త తరహా కథల్ని చేస్తూ ఎప్పుడూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుంటారు ఆయన. ఈ మధ్య ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలను చేస్తున్నారు నాగార్జున. లేటెస్ట్ గా నానితో కలిసి దేవదాస్ మూవీ లో నటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఒక ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటింఛారు కింగ్ నాగార్జున. ‘ఇండస్ట్రీలో అందరూ స్నేహితులే. కానీ ఏదైనా సినిమా నచ్చిన వెంటనే ఫోన్ చేసేది మాత్రం మహేష్. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నాకు బాగా గుర్తు ఉన్న మహేష్ కాల్ మనం టైం లోది. మనం చూశాక మహేష్ ఫోన్‌ చేసి సినిమా బాగుంది, చివర్లో అఖిల్ ఒక్క నిమిషం పాటు తెరపై కనిపించి వెలిగిపోయాడు.

ఒక్క నిమిషంతో సినిమా క్రెడిట్ అంతా తనే తీసుకెళ్లిపోయాడు అని చెప్పాడు. మంచి సినిమాలను ఎంకరేజ్ చేయడంలో మహేష్ ఎప్పుడూ ముందు ఉంటాడు. దేవదాస్ సినిమా విజ‌యం సాధించినందుకు అంద‌రికీ థ్యాంక్స్. ఇంత మంచి అవ‌కాశం అందించినందుకు ప్ర‌త్యేకంగా మా నిర్మాత అశ్వినీద‌త్ గారికి కృత‌జ్ఞ‌త‌లు’ అని అన్నారు నాగార్జున.

ఓవైపు హిందీలో ‘బ్రహ్మాస్త్ర’, మరోవైపు తమిళ హీరో ధనుష్ సినిమాలో ఒక పాత్ర చేయనున్నారు నాగార్జున. ‘ఊపిరి’ తర్వాత తెలుగు, తమిళంలో ధనుష్ తో బైలింగ్వల్ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీని ధనుష్ డైరెక్ట్ చేయడం విశేషం. ఈ మూవీకి తమిళంలో ‘నాన్ రుద్రన్’ అనే టైటిల్ ఖరారు చేశారు.

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి, సూపర్‌స్టార్ మహేష్ కాంబినేషన్‌లో మహర్షి చిత్రం క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకొంటున్నది. భరత్ అనే నేను సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో మహర్షి పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పైగా ఇది సూపర్‌స్టార్ కెరీర్‌లో 25వ సినిమా. దీంతో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించడమే కాకుండా సబ్జెక్ట్ విషయంలోనూ ఫ్రెష్ నెస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కథపై నమ్మకంతో తీస్తున్న మహర్షి పై బోలెడు అంచనాలున్నాయి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న మహర్షి మన ముందుకు రానున్నాడు.

Share

Leave a Comment