అమ్మ నేర్పినవే

ప్రతి మెన్ సక్సెస్ వెనక ఒక ఉమెన్ ఉంటుంది అని చెబుతుంటారు. ఈ విషయాన్ని అక్షరాల నిజం చేశారు నమ్రత శిరోద్కర్. మహేష్ బాబు ఇటు నటుడిగా అటు సినిమా వ్యాపార రంగాల్లో అగ్రస్థాయికి ఎదగడంలో ఆమె కీలకపాత్ర పోషించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మహేష్ బాబు కూడా పలు సందర్భాల్లో తన భార్య నమ్రత గురించి ప్రస్తావిస్తూ ఆమె స్నేహితురాలు, నా ప్రపంచం అని చెప్పుకొచ్చారు. ఇలాంటి భార్య దొరికినందుకు నేను ఇలాంటి స్ట్రాంగ్ మదర్ దొరికినందుకు నా పిల్లలు అదృష్టవంతులు అంటూ గతంలో అనేక సందర్భాలలో చెప్పిన సంగతి తెలిసిందే.

ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మహేష్ సతీమణి నమ్రత గారు మాట్లాడుతూ మహిళలు అందరు స్ట్రాంగ్‌గా ఫిట్‌గా ఉండాలి. కుటుంబ భాధ్యతలతో పాటు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలి అని చెప్పుకొచ్చారు. సితార పాపను సందర్బానుసారంగా ట్రెడిషనల్‌గా తయారు చేయడం నాకు అలవాటు.

ఇది మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. మేము స్కూలుకు వెళ్లే రోజుల్లో రెండు జడలు వేసుకోవాలనే రూల్ ఉండేది. అందుకే సితార పాపను కూడా అప్పుడప్పుడు రెండు జడలు వేసి తయారు చేస్తూ ఉంటాను అని నమ్రత చెప్పుకొచ్చారు.

మహిళలు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నేను అప్పటికీ ఇప్పటికీ ఒకే రకమైన ఫిజిక్ మెయింటేన్ చేయడానికి కారణం నా జీవన విధానమే. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. సరైన ఆహారం తీసుకుంటాను. ప్రతి రోజూ ఎక్సర్ సైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను అన్నారు.

భర్తగా తండ్రిగా మహేష్, భార్యగా తల్లిగా నేను మా బాధ్యతల విషయంలో క్లియర్‌గా ఉన్నాం. ఏమైనా ఇద్దరం కూర్చుని పరిష్కరించడానికి కృషి చేస్తాం. మెచ్యూర్డ్‌గా ఉంటాం. మా మధ్య సమస్యలు ఏమీ ఉండవు. కలిసే సమస్యను ఎదుర్కొంటాం. మేమిద్దరం ఒక్కటే ఒక్క తీరుగా ఆలోచిస్తాం అన్నారు.

నా ఫుడ్ హాబిట్స్ అన్నీ చాలా డిసిప్లిన్‌గా ఉంటాయి. ఆంధ్రా ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే నేను ఇంట్లో వంట చేయను ఎందుకంటే నాకు తెలుగు వంటకాలను అంత రుచిగా వంట చేయడం రాదు. హెల్దీ ఫుడ్ మాకు వండి పెట్టడానికి మంచి వంటవారు ఉన్నారు… అని నమ్రత నవ్వుతూ తెలిపారు.

మహేష్ నమ్రత ల బందం ఎంతో చూడముచ్చుటగా ఉంటుంది. ఎటువంటీ భేషాజాలాలకి పోకుండా ఎన్నోసార్లు మహేష్ తన సతీమణి నమ్రత గురించి ఇంటర్వ్యూలలో థి బెస్ట్ వైఫ్ అని చెప్తూ వచ్చారు. నా బ్యాక్‌బోన్ నా సతీమని నమ్రత. నా జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది.

నేను కేవలం ఆమెను అమితంగా ప్రేమించడమే కాకుండా చాలా విషయాలు ఆమే మీదే ఆధరపడతాను. పిల్లల విషయం లో నమ్రత బెస్ట్ మదర్. వాటినన్నింటిని ఆమే చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాండిల్ చేస్తుంది. అని సూపర్‌స్టార్ మహేష్అనేక సందర్భాలలో తెలిపారు.

Share

Leave a Comment