ఫస్ట్ చెప్పింది నేనే

ఒక‌రి కోసం ఒక‌రు అన్న‌ట్లుగా ఉన్నారు. ఇన్నేళ్ల‌లో మ‌హేష్, న‌మ్ర‌త జంట‌పై ఒక్క‌సారి కూడా చిన్న రూమ‌ర్ రాలేదంటే వాళ్ల దాంప‌త్యం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇంత అన్యోన్యంగా ఉండే మహేష్-నమ్రత ప్రేమవివాహానికి 14 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా నమ్రత ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తమ మధ్య ఎప్పుడు ప్రేమ చిగురించిందో చెబుతూ ‘వంశీ’ షూటింగ్ సమయంలో షూటింగ్ కోసం న్యూజీల్యాండ్ వెళ్లామని.. ఆ సమయంలో తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు. కానీ అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసరికి ఇద్దరం ప్రేమలో ఉన్నామని అర్థం అయిందని చెప్పారు.

వంశీ మూవీ ముహూర్తం టైంలో మొదటిసారి తాను మహేష్ ను కలిసినప్పుడు చాలా రిజర్వ్‌డ్‌ గా క్వైట్‌గా కూర్చోవడమే కాకుండా కనీసం తనకు హలో కూడా చెప్పకపోవడంతో అన్ని రోజులు కలిసి ఎలా షూటింగ్ చేయాలి అని మధన పడ్డ విషయాలను నమ్రత గుర్తుకు తెచ్చుకుంది.

సినిమా కోసం తామిద్దరం న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు తానె చొరవతీసుకుని మాట్లాడినప్పుడు మహేష్ చాలా ఫన్ లవింగ్ పర్సన్ అని విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉందని తను మాట్లాడడం మొదలెడితే నవ్వు ఆపలేమనే విషయాలు తనకు తెలిశాయి అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంది.

“నేనే ముందు మహేష్‌కు ఫోన్ చేసి ప్రపోజ్ చేశాను. అప్పటికే మహేష్ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకరి గురించి మరొకరికి అవగాహన ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాం” అంటూ తెలిపారు. పెళ్లి తర్వాత నటించడం తనకే ఇష్టంలేక నటించలేదని వెల్లడించారు. నటన టేకప్ చేస్తే కెరీర్‌కు కుటుంబానికి న్యాయం చేయలేనని అనుకున్నాను అందుకే నటనకు స్వస్తి చెప్పానని వివరించారు.

అందుకే అప్పటికి కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి సినిమాలకు దూరం అయ్యానని తెలిపారు. భర్తగా మహేష్‌కు 10 కి 10 మార్కులు వేస్తానని.. అదే నటుడిగా 10 కి 20 మార్కులు వేస్తానని తెలిపారు. మహేష్ పిల్లల్ని చెడగొడతారు. నేను స్ట్రిక్ట్‌గా ఉంటాను. సో… వాళ్ళకు విలన్‌ నేనే! అని నవ్వుతూ తెలిపారు.

తనపై ఎప్పుడూ పిల్లలు మహేష్‌కు కంప్లైంట్ చేస్తారని పేర్కొన్నారు. వాళ్ళకు ఏదైనా కావాలనుకుంటే నాన్న దగ్గరకు వెళ్ళి అడుగుతారు. నేను అయితే వాళ్ళు అడిగిన ప్రతిదానికీ ‘యస్‌’ చెప్పను. అందుకుని, నాన్న దగ్గరకు వెళతారు..పిల్లలిద్దరూ నాన్న కుచీలే అని నమ్రత తెలిపారు.

మ‌హేష్ ను తెరపై చూడ‌ట‌మే మాకు ఆనందం. బాబుకి రాజకీయాలపై అవ‌గాహ‌న లేదు. ఆస‌క్తి అస్సలు లేదు. ఆయన ఫోకస్‌ అంతా నటన మీదే. సినిమాలు త‌ప్ప బాబుకి ఇంకో లోకం లేదు. ఎట్టి ప‌రిస్థితుల్లో బాబు రాజకీయాల్లోకి రారు.. అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు న‌మ్ర‌త‌.

బయట చాలామంది మహేష్ ప్రతి నిర్ణయం వెనక నమ్రత ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఈ విషయంపై స్పందిస్తూ “మహేష్ తీసుకునే నిర్ణయాల్లో నా జోక్యం ఉండదు. తనే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. బయట జరుగుతున్న ప్రచారం అబద్దం అని స్పష్టం చేశారు.

మహేష్ బాబు ఎంత పెద్ద సూపర్ స్టారో.. అంతే కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ కూడా. కొంచెం ఖాళీ సమయం దొరికినా చాలు భార్య నమ్రత.. పిల్లలు గౌతమ్, సితారలతో సమయం గడిపేందుకు విదేశాలకు వెళతారు. మొత్తానికి ఇద్ద‌రు పిల్ల‌లు, భార్య‌తో లైఫ్ ఆనందంగా మార్చేసుకున్నాడు సూప‌ర్ స్టార్.

నమ్రత తన జీవితంలోకి వచ్చిన తర్వాత మరింత సంతోషం తన లైఫ్‌లోకి వచ్చినట్లయిందని మహేష్ తరచూ చెబుతుంటారు. ఈ ఇద్ద‌రి ప్రేమ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. అభిమానులు కూడా ఈయ‌న్నే ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. భార్యాభ‌ర్త‌లు అంటే ఇలా ఉండాలి అంటూ వాళ్ల‌ను చూపిస్తున్నారు.

టాలీవుడ్ బెస్ట్ క‌పుల్స్ లో ఒక‌రిగా నిలిచిపోయారు ఈ ఇద్ద‌రూ. మహేష్, నమ్రత ఇలానే ఆనందంగా ఎల్లప్పుడూ కలిసి ఉండాలని, ఇలాంటి పెళ్ళి రోజులు మరెన్నో ఎప్పటికీ ఆనందంగా జరుపుకోవాలని అభిమానులు ఆనందంగా కోరుకుంటూ తమ శుభాకాంక్షలను తెలుపుతున్నారు.

Share

Leave a Comment