మీరే మా డ్రైవింగ్ ఫోర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్‌లో ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్‌ను మహేష్ తండ్రి, ప్రముఖ నటుడు కృష్ణ ఈ నెల 2న ప్రారంభించారు. ఈ సందర్భంగా తన మామయ్యకు మహేష్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రాం ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృష్ణతో దిగిన పిక్‌ను ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్ చేసిన నమ్రత కార్యక్రమాన్ని తన రాకతో ప్రత్యేకంగా మలచినందుకు ధన్యవాదాలు తెలిపింది. దీని బట్టి ఆమెకి కృష్ణ గారి మీద ఎంత ప్రేమ గౌరవం ఉందో తెలుస్తుంది. తను పెట్టిన పోస్టులో కృష్ణ గారిని డాడ్ అని సంబోధించి నమ్రత నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

‘మీ ప్రేమ, ఆదరణే.. నాకు, మహేష్ బాబు కు బలాన్నిచ్చి ముందుకు నడిపిస్తున్నాయి. మా కోసం వచ్చి, ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకం చేసిన మీకు ధన్యవాదాలు డాడ్‌. మీరే మా డ్రైవింగ్ ఫోర్స్.. ఎప్పటికీ మాకు స్ఫూర్తిదాయకం మీరే’ అంటూ ‘అంతులేని ప్రేమ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను నమ్రత జత చేశారు.

అత్యాధునిక హంగులతో ఇంద్రభవనాన్ని తలపించేలా ఏఎంబి సినిమాస్ ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మల్టిప్లెక్స్ ప్రారంభోత్సవం లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీదగా కాగా టాలివుడ్, బాలివుడ్ కి సంభందించిన అనేక మంది అతిరధమహారధులు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

ఇదిలా ఉండగా నమ్రత సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. మహేష్, నమ్రత కలసి 150 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయించారు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం నమ్రత ప్రకటించారు. అన్ని సర్జరీలు విజయవంతమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. మహేష్ దత్తత తీసుకున్న సిద్ధాపురం, బుర్రిపాలెం గ్రామాల్లోని చిన్నారులకు ఈ ఉచిత సేవలు అందించినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబుకు చెందిన ఎఎంబి సినిమాస్‌లో మూవీ చూశాను. చూశాక నాకు ఓ విషయం అర్థమైంది. ప్రతి సినిమాకు ఇక్కడ ఓ సమస్య ఉంటుంది. ఎందుకంటే ఈ సూపర్ మల్టీప్లెక్స్‌తో మ్యాచ్ అవ్వడం ఏ సినిమా వల్ల కాదు. ఇదొక వండర్ ఫుల్ ప్లేస్ అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు.

కోన వెంకట్..ఇన్నిరోజులు సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్ళేవాళ్ళం..ఇప్పుడు థియేటర్ని చూడటానికి సినిమాకి వెళ్తాము..ఇది మాములు థియేటర్ కాదు, వరల్డ్ క్లాస్ ముల్టిప్లెక్స్ అన్నారు. బాలివుడ్ బాక్సాఫీస్ ట్రాకర్ తరన్ ఆదర్ష్ సైతం మహేష్ మల్టీప్లెక్స్ ని చూసి ఫిదా అయ్యను అని తెలపడం విశేషం.

వాట్ యాన్ ఎక్స్‌పీరియన్స్. హైదరాబాద్‌లో ఉన్న బెస్ట్ మల్టీప్లెక్స్ ఇది. టాప్ నాచ్ ఎక్విప్‌మెంట్. సందేహం లేకుండా సిటీలో ఉన్న బెస్ట్ ఏఎంబి సినిమాస్ అని అనిల్ రావిపుడి ప్రశంసించారు. అడివి శేష్ సైతం ఇక్కడ సినిమా చూసి మంత్రముగ్ధుడినయ్యాను అందులోను నా ఆరాధ్య హీరో సూపర్‌స్టార్ కృష్ణ గారిని మరలా ఇక్కడ కలవడం మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. మహేష్‌ బాబు కిది 25వ చిత్రం కావడంతో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించడమే కాకుండా సబ్జెక్ట్ విషయంలోనూ ఫ్రెష్ నెస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కథపై నమ్మకంతో తీస్తున్న మహర్షి పై బోలెడు అంచనాలున్నాయి.

మహర్షి అంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటి కంటే ది బెస్ట్‌గా ఇందులో మహేష్ బాబు పాత్ర ఉంటుందట. చాలా యంగ్ గా, రఫ్ లుక్ లో ఆకట్టుకున్నారు మన సూపర్ స్టార్. ‘ఉగాది’ కానుకగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.

Share

Leave a Comment