ట్రెడిషనల్ లుక్‌లో

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయం నమ్రత పోస్టు చేసే విషయాల ద్వారానే బయటి ప్రపంచానికి తెలుస్తుంటాయి. తాజాగా నమ్రత పోస్టు చేసిన ఓ పిక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

నమ్రత, సితార ఈ ఫోటోలో అదిరిపోయే లుక్స్‌లో కనిపించడమే అందుకు కారణం. తల్లి కూతుళ్లు ఇద్దరూ కలిసి ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇంత అద్భుతమైన లుక్ లో ఇద్దరూ ఎప్పుడూ కనిపించలేదని, ముఖ్యంగా సితార లుక్ చాలా క్యూట్ గా ఉందని అంటున్నారు సూప‌ర్ స్టార్ అభిమానులు.

మహేష్ సతీమణి నమ్రత, గారాల పట్టి బేబీ సితార పూర్తి సాంప్రదాయ దుస్తుల్లో సాయిబాబా పక్కన నిలుచున్న ఫోటో చూసేందుకు అభిమానులకు రెండు కళ్ళు చాలటం లేదు. రెడ్ ఎథ్నిక్ సల్వార్ ధరించిన నమ్రత ఎంతో అందంగా కనిపించారు. సితార బ్లూ టాప్, కలర్‌ఫుల్ లెహంగా ధరించి క్యూట్ లుక్ తో ఆకట్టుకుంది.

జివికె మనవరాలు అయిన శ్రీయకు, అపోలో గ్రూప్ కు ఒకానొక వారసుడు అయిన ఆనందిత్ల ఫంక్షన్‌కు ఇలా వెళ్ళినట్లు పేర్కొన్నారు నమ్రత. అవర్ వెరీ ఓన్ శ్రియ ఆండ్ ఆనందిత్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, విషింగ్ యూ టు ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆండ్ హ్యాపినెస్ అని పోస్ట్ చేసారు.

ఉపాసన ఐతే సితారతో దిగిన పిక్స్ ఆండ్ వీడియోస్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు. అవన్నీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.నెటిజన్లు షేర్ల మీద షేర్లు చేసుకుంటున్నారు. సితార ఎప్పుడు ఏం చేసినా కూడా క్యూట్ గా బాగుంటుంది.

పిల్లలు గౌతమ్, సితారలతో వెళ్ళిన ఫ్యామిలీ ట్రిప్ లు తదితర ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ప్రిన్స్ ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లో ఉంచుతారు నమ్రత. నమ్రత షేర్ చేసిన ఏ ఫోటో చూసినా కూడా సితార చిలిపి అల్లరి భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో సూప‌ర్ స్టార్ మహేష్ ముద్దుల కూతురు సితారే హైలైట్ గా నిలిచింది. ఈ ఫొటోలన్నీ కుడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా మారిపోయాయి.

Share

Leave a Comment