స్పెషల్ మ్యాజిక్ స్పెల్ లాగా

మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ పర్సన్. ప్రొఫెషన్ కు ఇచ్చినదాంతో సమానంగా.. ఆ మాటకు వస్తే అంతకు కొంచెం ఎక్కువగానే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాడు. భార్యా పిల్లలతో కలిసి మహేష్ గడిపే ఫారిన్ ట్రిప్పులు బహుశా మరే టాలీవుడ్ హీరో తిరగలేదంటే ఆశ్చర్యమేమీ లేదు.

మహేష్ సతీమణి ఫ్యామిలి హాలిడే లో గడిపిన హ్యాపీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అందంగా సెట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు లో మహేష్ బాబుతో పాటు కొడుకు గౌతమ్.. కూతురు సితార లవ్‌లీ మొమెంట్స్ గడిపారు. అక్కడి నుంచి కొన్ని ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నమ్రత.

‘థ మ్యాజిక్ వీవర్’ అని క్యాప్షన్ పెట్టి నమ్రత ఈ స్పెషల్ పిక్ ని షేర్ చేసారు. మహేష్ యొక్క ప్రెసెన్స్ పిల్లలిద్దరిని ఎంతో ప్రేమతో కలిపే ఒక మ్యాజిక్ స్పెల్ లాగా పని చేస్తుంది అని ఖితాబు ఇచ్చారు నమ్రత. అంతే కాకుండా ‘మిస్సింగ్ అవర్ హాలిడే టైం టుగెదర్’ అని కూడా జత పరిచారు.

వీటిలో ప్రతీ ఫోటోలోను తండ్రి మహేష్ తో ఎంతో సరదాగా పిల్లలిద్దారు గడుపుతున్న ఆనందక్షణాలు ని చూసి అభిమానులు హర్షిస్తున్నారు. తండ్రి అంటే ఈ పిల్లకు ఎంత ప్రాణమో.. కూతురు అంటే ఆ తండ్రికి ఎంత ఇష్టమో చెప్పకుండానే చూపించే అందమైన పిక్స్ ఇవి.

టాలీవుడ్ లో బెస్ట్ డాడీ అవార్డులు పోటీ పెడితే సూపర్‌స్టార్ మహేష్ బాబు టాప్ లో ఉంటాడని చెప్పవచ్చు. సితార ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌నక్క‌ర్లేదు. నాన్నకూచిగా సితార కనిపిస్తుంటే.. తన గారాల పట్టితో భలే ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు.

మ‌హేష్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా కోసం డెహ్రాడూన్‌లో ఉన్నాడు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ డెహ్రాడూన్‌ షెడ్యూల్‌ వచ్చే నెల 6 వరకు జరుగుతుందట. నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం మూవీ టీమ్‌ యూఎస్‌ వెళ్తారట. ఈ కాలేజీ సీన్ల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నాయి.

Share

Leave a Comment