ఇంట్లో లేకపోతే అక్కడే ఉంటారట…

కరోన కారణంగా షూటింగ్‌లు ఆగిపోవటంతో సినీ తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ ఫ్యామిలీకి దూరంగా ఉండే స్టార్స్‌ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు ఈ గ్యాప్‌లో ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టారు స్టార్స్‌.

అంతేకాదు అభిమానులను ఇన్‌స్పైర్‌ చేసేందుకు తమ వర్క్ అవుట్‌ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. నాలుగు పదుల వయసు దాటినా ఆకట్టుకునే ఫిట్‌నెస్‌తో ఇరవై ఏళ్ల కుర్రాడిలా హ్యాండ్సమ్‌గా మెరిసిపోతున్నారు మహేష్ బాబు.

అయితే ఆ ఫిట్‌నెస్‌ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? మహేష్ ఇప్పటికీ టీనేజ్ కుర్రాడిలా ఉండటానికి కారణం ఏంటి? తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వర్క్‌ అవుట్స్‌కు సంబంధించి ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

మహేష్ ఇంట్లో ఉండకపోతే ఇక్కడే ఉంటాడంటూ జిమ్‌ వీడియోను షేర్ చేసి వర్క్‌ అవుట్స్ విషయంలో మహేష్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాడో క్లారిటీ ఇచ్చింది నమత్ర. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. లైక్స్ కామెంట్స్ తో ట్రెండింగ్ లోకి వెళ్ళింది ఈ వీడియో

ఇదే మహేష్ ఇంటి జిమ్. ఇక్కడ ఆయన చేసే పని ఇది. అతని పుట్టినరోజు బహుమతి. మాస్టర్స్ డెన్. మీ అందరికీ తెలుసు ఆయన ఇంట్లో లేడంటే ఎక్కడుంటారనేది అని ట్యాగ్ చేస్తూ మహేష్ వర్కవుట్ వీడియో షేర్ చేసారు నమ్రత.

ఈ వీడియో చూసిన నెటిజన్లు మహేష్ వర్కవుట్స్ సూపర్. ఆయన ఫిట్‌నెస్ ఇంకా సూపర్. అందుకే ఆయన సూపర్ స్టార్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఓ సారి మహేష్ హోమ్ జిమ్‌ని సూపర్ స్టార్ అభిమానులకు చూపించి తన భర్త ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టారు నమ్రత

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు షార్ట్ గ్యాప్ తరువాత పరుశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారిపాట సినిమాను ఎనౌన్స్ చేశాడు, అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

మహేష్ చేయబోతున్న పరుశురాం సర్కారు వారి పాట సినిమా కూడా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అందుకు అనుగునంగా ఆయన కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. కమర్షియల్ సబ్జెక్ట్ అని చెప్తూనే ప్రయోగాలతో కెరీర్ ను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నాడు ప్రిన్స్

Share

Leave a Comment