ఒలంపిక్స్ కు రెడీ..!

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు స‌తీమ‌ణి నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంటారు. మహేష్‌ బాబు కు సంబంధించిన విషయాలతో పాటు ఇంట్లోని వారి పిల్లలు సితార, గౌతమ్‌ చేసే పనులను కూడా ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు

క‌రోనా వ‌ల‌న గౌత‌మ్, సితార‌లు ఇంటికే ప‌రిమితం కావ‌డంతో వారు ఇంట్లో చేసే సంద‌డికి సంబంధించి అనేక విష‌యాల‌ను లాక్‌డౌన్ టైంలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహ‌ప‌రుస్తున్నారు. అప్పుడప్పుడు మైండ్‌ గేమ్స్‌ పోస్ట్ చేసి మీ ఐక్యూని టెస్ట్ చేసుకోమని చెబుతుంటారు

తాజాగా ఆమె తన పిల్లలు స్విమ్‌ చేస్తున్న వీడియోని ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా షేర్‌ చేశారు. పిల్ల‌ల‌ను వారికి న‌చ్చిన ప‌నుల‌ను చేయ‌మంటాను. మా పిల్లలు ఒలంపిక్స్‌కు రెడీ అంటూ ఆమె షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది

మా పిల్లలు ఒలంపిక్స్‌కు రెడీ. వాళ్లకి ఇష్టమైన గేమ్స్ ప్రోత్సహిస్తూనే అన్నింటిలో ప్రావీణ్యం ఉండాలని చెబుతుంటాను. వ్యాయామంతో పాటు ఏదైనా ఆట ఆడుతూ ఉంటే మెదడు ఉత్తేజితమవుతుంది అని నమ్రత పేర్కొంది. తన పిల్లల పట్ల నమ్రత చూపించే శ్రద్దకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు

దీనికి మహేష్‌ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్‌, సితారలు స్విమ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక గతంలో కూడా పిల్లలకు సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నమ్రత

మహేష్ బాబు నమ్రతల తనయుడు గౌతమ్ మరియు కూతురు సితారలు అన్ని విషయాల్లో చురుకుగా ఉంటారు. ముఖ్యంగా సితార సోషల్ మీడియాలో అన్నయ్య గౌతమ్ కంటే కూడా కాస్త ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే

సినిమా సెలబ్రెటీలు గురించి ఎక్కువగా మీడియా లో పలు రకాలగా మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సినిమా పరిశ్రమకే చెందిన వారు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుంటే వారు ఎంత వరకు కలిసి ఉంటారు అనేది చెప్పలేం

కాని ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మహేష్ బాబు నమ్రతా టాలీవుడ్ లోనే ఆదర్శ జంటగా నిలిచారు. పెళ్లి చేసుకుని మహేష్ బాబు నమ్రతల మాదిరిగా జీవితాన్ని గడపాలని, వారిలా లైఫ్ లో ఎంజాయ్ చేయాలని బ్యాచిలర్ హీరోలు అనుకుంటూ ఉంటారు

నమ్రత వ్యాపారలు ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబ వ్యవహారాలు పూర్తిగా ఆమె చూసుకుంటారు. ఒక ఉత్తమ గృహిణిగా నమ్రత ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. పిల్లలు మరియు భర్త విషయంలో ఆమె చూపించే శ్రద్ద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

Share

Leave a Comment