ఆసక్తి రేపుతున్న కొత్త కాంబినేషన్

భరత్ అనే నేను సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ తన 25వ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కున్న ఆ సినిమా షూటింగ్ ఇటీవల డెహ్రడూన్ లో మొదలైంది. మహేష్ 25 వ చిత్రం కావడంతో వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అల్లరి నరేష్‌ మొట్ట మొదటి సారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నరేష్ మహేష్ ఫ్రెండుగా రవి అనే పాత్రలో నటిస్తున్నారు. అల్లరి నరేష్‌ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు 25వ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ వార్తను దృవీకరించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సినిమాలో నరేష్‌ పేరు కూడా చెప్పేశారు వంశీ పైడిపల్లి.

ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇంస్టిట్యూట్ లో జరుగుతుంది. దీనినే ఐఐటి గా సినిమాలో చూపించనున్నారని సమాచారం. కాలేజీ సీన్ల‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మహేష్ కుడా కాలేజీ కుర్రాడిలా కనిపిస్తారని టాక్.

డెహ్రాడున్ లో మహేష్ బాబు, పూజ హెగ్డేల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటుగా మరో కీలక పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్ మీద కూడా కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ వారంలో సాంగ్ షూట్ కూడా పూర్తి చేయనున్నారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం మూవీ టీమ్‌ యూఎస్‌ వెళ్తారట.

అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్ డే కావడంతో చిత్ర యూనిట్ బ‌ర్త్‌డేని సెట్‌లోనే జరిపించారు. మ‌హేష్, పూజా హెగ్డే, వంశీ పైడిప‌ల్లి త‌దిత‌రులు న‌రేష్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ పాల్గొన్నారు. బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు ప్రొడక్షన్ యూనిట్ అఫీషియల్ గా విడుదల చేసాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో మహేష్ తో పాటు, వంశీ పైడిపల్లి, పూజా హెగ్డే, డాన్స్ మాస్టర్ రాజు సుందరం ఇంకా దిల్ రాజు సోదరుదు శిరీష్ ఉన్నారు.

సూపర్ స్టార్ మహేష్ వ్యక్తిగత హెయర్ స్టయలిస్ట్ అయిన సల్మాన్ పుట్టిన రోజు నిన్న. దీంతో సల్మాన్ పుట్టిన రోజు వేడుకలను మహేష్25 సెట్లో ఘనంగా జరిపించారు మహేష్. మ‌హేష్, వంశీ పైడిప‌ల్లి త‌దిత‌రులు ఈ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ లో పాల్గొన్నారు.

Share

Leave a Comment