అది అతని సొంతం !!

ప్రస్తుతం టాలీవుడ్ లో అమ్మ పాత్రలకు సహజ నటిగా పేరు దక్కించుకున్న సీనియర్ హీరోయిన్ జయసుధ గారు పెట్టింది పేరు అయ్యారనడంలో అతిసయోక్తి లేదు. స్టార్స్ కు అమ్మ పాత్రలో జయసుధ గారిని ఎక్కువగా ఎంపిక చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుకు పలు సినిమాల్లో అమ్మగా నటించారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, మహర్షి చిత్రాల్లో మహేష్ బాబుకు అమ్మ గా నటించారు జయసుధ. జయసుధ గారు ఒక ఇంటర్వ్యూలో షూటింగ్ అనుభవాలను, మహేష్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకొచ్చారు. ఆవిడ మాట్లాడుతూ మహేష్ నేను హీరోయిన్ గా నటించిన సినిమాలో బాల నటుడిగా చేశాడు.

అందుకే అప్పటి నుండే నాకు మహేష్ తెలుసు. చాలా మంచి వ్యక్తి. ఎంత పెద్ద స్టార్ అయినా ఏమాత్రం గర్వం ఉండదు. పెద్దలను గౌరవించడంతో పాటు చాలా నిజాయితీగా మాట్లాడతాడు. అతడితో నటిస్తున్న సమయంలో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. విజయ నిర్మల గారు నాకు బందువు అవ్వడం వల్ల కృష్ణ గారి ఫ్యామిలీతో చాలా ఏళ్లుగా సన్నిహిత్యం నాకు ఉంది.

ఆ అనుబంధం వల్ల మహేష్ ను చిన్నప్పటి నుండి ఎక్కువగా కలవడం జరిగింది. మహేష్ ఏ సినిమా చేసినా దాన్ని తన మొదటి సినిమానే పరిగణించి చేస్తూ ఉంటాడు. మహేష్ చాలా చాలా నాటీ. ఎక్కువగా ప్రాంక్స్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో తను నవ్వడు, మనం మాత్రం పగలబడి నవ్వుతాం.

చాలా చాలా చాలా నాటీ. తను ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలో చేయాలి. అప్పుడే మనం రియల్ మహేష్ ను చూస్తాం. అంతలా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు మహేష్. తను ఈ పాత్రనైనా అవలీలగా చేయగలడు. అంత టాలెంట్ అతని సొంతం. దర్శకుడు ఏది చెప్తే అది ఇచ్చేందుకు చాలా కష్టపడుతూ ఉంటాడు.

దర్శకుడు ఎలా మల్చుకోవాలనుకుంటే మహేష్ అలా మారిపోతాడు. డైరెక్టర్స్ యాక్టర్ మహేష్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహర్షి చిత్రంలో మహేష్ బాబు నటన తారా స్థాయికి వెళ్లింది. రెండు మూడు సీన్స్ లో మహేష్ బాబుతో యాక్టింగ్ చేసే సమయంలో అతడి యాక్టింగ్ చూసి నేను ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం మర్చి పోయాను.

నాతో కంట తడి పెట్టించాడు. మహేష్ యాక్టింగ్ కు సెట్స్ లోనే కన్నీరు పెట్టుకున్నాను. అంతగా పాత్రలో ఒదిగి పోయి నటించాడు. మహర్షి చిత్రంలో ఎవర్ గ్రీన్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. సినిమా కోసం మహేష్ ప్రాణం పెట్టేస్తాడు. ఇంత గొప్ప యాక్టర్, సౌమ్యుడు, పెద్దవాళ్లంటే గౌరవమున్న నటుడిని తాను ఇంతవరకూ చూడలేదని జయసుధ చెప్పుకొచ్చారు.

వరుస సినిమాలు, అన్నీ సక్సెస్‌లు. ఇలా మంచి జోష్‌లో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన కెరీర్‌లో 26వ సినిమాగా వచ్చిన సరిలేరునీకెవ్వరు రికార్డుల సునామీ సృష్టించడంతో 27వ సినిమా పై రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల అంచనాలు రీచ్ అయ్యేలా భారీ హంగులతో ఈ సినిమా రూపుదిద్దుకోబోతుంది.

మహేష్ త్వరలోనే పరుశురామ్ తో తన తదుపరి సినిమా చేయనున్నాడు. మరో సారి కొత్త కథ కధానాలతో మన ముందుకు రానున్నారు. ప్రస్తుతం పరుశురామ్ ఈ సినిమా స్క్రిప్టు వర్క్‌ చేస్తున్నాడు. ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది అని సమాచారం.

Share

Leave a Comment