అభిమానులూ సిద్ధంగా ఉండండి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ తెలుగు రాష్ట్రాల్లో విజయవిహారం చేసింది. ఓవర్సీస్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి నీరాజనాలు పట్టారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

భరత్ అనే నేను ను తమిళ, మలయాళంలోకి అనువదించి ఈ రోజు అంటే మే 25న విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్న విధంగా రెండు భాషల్లోనూ భరత్ అనే నేను ఈ రోజు విడుదల కావడం లేదు.

ఇప్పుడు ఒక కొత్త డేట్ ప్రకటించారు భరత్ అనే నేను అనువాద హక్కులను పొందిన నిర్మాతలు. తమిళ, మలయాళ రెండు భాషల్లోనూ ఈ నెల 31న విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

అంటే భరత్ అనే నేను మహేష్ అమ్మగారు ఇందిరా దేవి పుట్టిన రోజు ఏప్రిల్ 20న విడుదలైతే, తమిళంలో ‘భరత్ యనుమ్ నాన్’ పేరుతో, మలయాళంలో ‘భరత్ ఎన్న అంజాన్’ పేరుతో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు నాడు మే 31న విడుదల కానుంది అనమాట. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు మరియు డబ్బింగ్ వెర్షన్స్ సక్సెస్ ఆనందించటానికి అభిమానులూ సిద్ధంగా ఉండండి.

‘భరత్ యనుమ్ నాన్’ ఆడియోని ఈ రోజు అంటే మే 25న రిలీజ్ చేయనున్నారు.మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా తో తమిళనాడులో ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఇంకా పెంచుకున్నారు. అక్కడ యూత్ లో మహేష్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

‘భరత్ అనే నేను’ తెలుగు వెర్షన్ తమిళనాడులో ఆల్ టైం రికార్డు స్రుష్టించింది. ఒక్క చెన్నై లోనే ఈ సినిమా రూ.1.70 కోట్ల షేర్ ని సాధించి ‘బాహుబలి 2’ రికార్డుని క్రాస్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది.

ఇప్పటికే కేరళలో ఏ తెలుగు చిత్రం కు సాధ్యం కాని రీతిలో పది రోజులకే 1 మిలియన్ రాబట్టి కేరళలో హయ్యస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది భరత్ అనే నేను. ఇక ఇప్పుడు మలయాళం వెర్షన్ ‘భరత్ ఎన్న అంజాన్’ తో కేరళలో మహేష్ క్రేజ్ ఇంకా పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో మహేష్ ఫోకస్ నెక్స్ట్ మూవీపై పడింది. మహేష్ బాబు తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం మహేష్ బాబుకు 25 వ చిత్రం. కాగా మహేష్ బాబు 26 వ చిత్రం సుకుమార్ తో చేయనున్నారు.

Share

Leave a Comment