మహేష్ ని ఇంప్రెస్ చేసిన కొత్త దర్శకుడు

ఇటీవల విడుదలైన కోలీవుడ్ సినిమా అటు తమిళం తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. విశాల్ కెరీర్ లోనే ఆ సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకోవడమే కాకుండా అత్యధిక వసూళ్లను అందుకున్న చిత్రంగాను ‘అభిమన్యుడు’ నిలిచింది.

తమిళ హీరో విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ చిత్రం తెలుగులో ‘అభిమన్యునుడు’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించిన డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు, విమర్శకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడ ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడ ఈ సినిమాను వీక్షించి సినిమా పట్ల తాను చాలా ఇంప్రెస్ అయ్యానని అన్నారు. మహేష్ కు నచ్చితే వెంటనే ట్వీట్ చేయడం అలవాటు. ఇక అభిమన్యుడు కూడా నచ్చడంతో ప్రిన్స్ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.

సినిమా చాలా బావుంది. సినిమా అర్ధమయ్యేలా దర్శకత్వ ప్రతిభ కనిపిస్తోంది. దర్శకుడు మిత్రన్ విజన్, డైరెక్షన్ చాలా బాగా ఉన్నాయని, చాలా బాగా రీసెర్చ్ చేసి సినిమాను తెరకెక్కించారు. కథానాయకుడు విశాల్ కి అలాగే చిత్ర యూనిట్ కంగ్రాట్స్ అంటూ మహేష్ విషెస్ అందించాడు.

ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు సమర్పించారు. ప్రస్తుతం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లతో నడుస్తున్న ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ కూడ ఉంటుందని విశాల్ గతంలోనే తెలిపారు.

ఇక ప్రస్తుతం మహేష్ తన 25వ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ సోమవారం డెహ్రడున్ లో స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ లో కాలేజ్ కు సంబందించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్వయంగా షూటింగ్ స్పాట్ కి వెళ్లి మహేష్ బాబుని కలిశారు. దిల్ రాజు – సి.అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటుస్తున్న సంగతి తెలిసిందే.

Share

Leave a Comment