వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు !!

ప్రిన్స్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

షూటింగ్ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. డిసెంబర్ 13 ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ కారైకుడి (తమిళనాడు) బయలుదేరనుంది.

26 వరుకు జరిగే ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. యాక్షన్‌ పార్ట్‌, కొన్ని కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

శ్రీమంతుడు.. ఇండస్ట్రీ హిట్. ఆ కాంబినేషన్లో మూవీ అంటే భారీ అంచనాలు ఉంటాయి. అందుకే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాపై క్రేజ్ నెలకొని ఉంది.

ఈ మధ్య ‘2.0’ ఏప్రిల్ లో విడుదల కానుందని, దాని వలన మహేష్ సినిమా వాయిదా పడవచ్చని వార్తలొచ్చాయి.

కానీ చిత్ర యూనిట్ మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టు ముందుగా ప్రకటించిన తేదీకే కట్టుబడ్డారు. ఈ సినిమా కోసం కొరటాల శివ పక్కా స్క్రిప్ట్ సిద్దం చేసుకొని సినిమా తీసున్నాడని సమాచారం.

తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకొనే కొరటాల ఈ సినిమాలో విద్యా వ్యవస్థ మరియు పేదరికం గురించి చర్చించబోతునట్లు తెలుస్తోంది.

ఇందులో తొలి సారి మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమా రికార్డుల మోత ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.

శ్రీమంతుడికి సంగీతమందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి స్వరాలూ సమకూర్చారు. ఆ పాటలకు సూపర్ డిమాండ్ ఉంది. అది కూడా భారీ ధరకు.

సినిమా ఆడియో రైట్స్ ఇప్పటికే లహరి వారు కొనేశారట అది కూడా రికార్డ్ ప్రైజ్ లో ఈ ఆడియో రైట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తుంది.

ఫ్యాన్సీ రేటుకు (సుమారు రూ.2 కోట్లకు పైన) లహరి మ్యూజిక్ కంపెనీ హక్కులను సొంతం చేసుకుందట. దీంతో సినిమాపై ఏ స్థాయిలో క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

కేవలం ఆడియో ఇంత ధర పలికిందంటే ఇక సినిమా బిజినెస్ ఏ స్థాయిలో ఉండబోతోందో అని ట్రేడ్ వర్గాల వారు ఆలోచిస్తున్నారు.

కైరా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రధారులు. ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.

చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించినట్లు ఈ సినిమా ఏప్రిల్ 27 నాడే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Share

Leave a Comment