సూపర్‌స్టార్ పాపులారిటీ

టాలీవుడ్ లో అందగాడు అనగానే టక్కున చెప్పే పేరు సూపర్‌స్టార్ మహేష్ బాబు. కేవలం అందం ఒక్కటే కాదు, నటనలో కూడా ముఖ్యంగా ఇంటెన్సిటీ ని కళ్ళలో మహేష్ పలికించినట్టు ఇంక వెరే ఎవరు చూపించలేరు అని చెప్పడం లో సందేహం లేదు. బాలీవుడ్ స్టార్స్ లో కూడా మహేష్ లాంటి అందగాడు లేడంటే అతిశయోక్తి కాదు. హాలీవుడ్ కటౌట్ తో మహేష్ టాలీవుడ్ ను ఏలుతున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ కు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా మహేష్ క్రేజ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. తాజాగా నమ్రత తన ఇన్‌స్టాగ్రాం ఖాతా నుంచి మహేష్ పాపులారిటీ గురించి ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసారు. ఆ వీడియో మీరు కూడా చూడండి.

Such a cutie❤❤❤ Amazing how cinema crosses boundaries and languages to touch people and hearts. Sending heaps of love to Ladinder Sherpa!!!! 🤗🤗🤗

ఆ వీడియోలో ఒక నార్త్ ఈస్ట్ అమ్మాయిని నీ ఫ్యావరెట్ హీరో ఎవరు అని అడిగితే మహేష్ బాబు అని చెప్తుంది. ఏ సినిమాలు ఇష్టం అంటే స్పైడర్, ది రియల్ టైగర్(దూకుడు) అని చెప్తుంది ఆ స్కూల్ అమ్మాయి. సినిమా ఎన్నో భాషలను, సరిహద్దులను దాటుకుని వెళ్ళిపోతుంది అని నమ్రత దీన్ని షేర్ చేసారు..

నిజమే ఎవరో ఒక నార్త్ ఈస్ట్ అమ్మాయి మహేష్ బాబు గురించి చెప్పడం నిజంగా గొప్ప విషయమే. పెద్ద‌తెర‌పైనే కాదు చిన్నితెర‌పై కూడా మ‌హేష్ బాబు ర‌చ్చ సాగుతుంటుంది. ఇక యూ ట్యూబ్‌లోనూ మ‌హేష్ బాబు సినిమాల‌కు డిమాండ్ ఫుల్లుగా ఉంటుంది. కాబట్టి ఇలా భారత దేశమంతా తన చరిష్మాతో మెస్మరైజ్ చేస్తున్నారు సూపర్‌స్టార్.

మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో వేసిన భారీ విలేజ్ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాలో అల్లరి న‌రేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రంకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక పల్లెటూరును సృష్టించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5, 2019 లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Share

Leave a Comment