ఓ వసుమతి ఫుల్ వీడియో సాంగ్

ఇప్పుడు ఎక్కడ చూసిన ‘భరత్ అనే నేను’ మూవీ సాంగ్స్ వినిపిస్తుండటంతో తాజాగా ‘ఓ వసుమతి’ ఫుల్ వీడియో సాంగ్ సాంగ్‌‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా.. ప్రేమ కవితల షెల్లీలా మారిపోయా నీ వల్లా’.. ఓ వసుమతి అంటూ స్లో మెలోడీ మొదలైన ఈ పాట..

అద్భుతమైన పదబందాల గమ్మత్తుతో మ్యూజిక్ లవర్స్‌ని రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకువెళ్తుంది. ఈ సాంగ్‌ను రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో యాజిన్ నిజార్, రీటాలు ఆల‌పించగా.. రామ‌జోగయ్య శాస్త్రి సాహిత్యం స‌మ‌కూర్చారు.

ఇందులో మహేష్ బాబు స్టైల్, కాస్ట్యూమ్స్, పాటలో వేసిన సెట్టింగ్ నిజంగా అదిరిపోయాయి అనే చెప్పాలి. మహేష్ కైరా అద్వానీ ల జంట కూడా ఒకరికొకరు సరిపోయారని పాట చూసిన ప్రేక్షకులు అందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా క్రింద ఇచ్చిన లింక్ లో ఆ పాట చూసేయండి..

రామజోగయ్య శాస్త్రి పదాలతో చేసిన గమ్మత్తు పాటను ఇంకో లెవెల్ కు తీసుకెళ్లగా స్లో పాయిజన్ లాగా దేవి ఇచ్చిన ట్యూన్ చాలా క్యాచీగా ఉంది. సూర్య చంద్రులతో మాట్లాడి గంటలు పెంచడం-విమానమంత పల్లకిని తేవడం రోదసిని మార్చడం లాంటి ఎన్నో ప్రయోగాలు ఇందులో ఉన్నాయి.

భరత్ అనే నేను తో నాలుగవ 100 కోట్ల గ్రాసర్ ని,85 కోట్ల షేర్ 2, 50 కోట్ల షేర్ 5 సినిమాలని తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. తెలుగు హీరోల్లో ఇదే హయ్యస్ట్. అమెరికాలో కూడా భరత్ అనే నేను తో 8వ మిలియన్ డాలర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. ఈ ఘనత సాధించిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్.

భరత్ అనే నేను ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వంశి పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు వేగవంతమయ్యాయి.

ప్యారిస్ ట్రిప్ లో ఉన్న మహేష్ వచ్చిన వెంటనే వంశి సినిమాలో నటిస్తాడు. వైజయంతి మూవీస్, దిల్ రాజు సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనే జరుపుకోనుంది.

ఈ సినిమా పూర్తయిన మహేష్, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ తో తన 26వ సినిమా చేయబోతున్నాడు. సుకుమార్ కథ, కథనాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు. మరొక్క కొత్త రకం కథ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించడానికి ముందుకు రాబోతున్నారు.

Share

Leave a Comment