పాన్ ఇండియా ఫేమ్

రాజమౌళి, శంకర్, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ ఇండియా డైరెక్టర్స్ విలువని నార్త్ లో నిలబెట్టిన వ్యక్తులు చాలా మందే ఉన్నారు. పాన్ ఇండియా స్టార్స్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తే చాలు. ముఖ్యంగా రాజమౌళి, శంకర్ లతో సినిమాలు చేస్తే చాలు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ వచ్చినట్లే.

అందుకే సౌత్ స్టార్ హీరోస్ కూడా వీళ్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ఈ పైన లిస్ట్ లో ఉన్న ఏ ఒక్క దర్శకుడితో కూడా కలిసి సినిమా చేయకున్నా ఇండియా వైడ్ ఫేమ్ ఉన్న ఈ జనరేషన్ తెలుగు హీరో మన సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు మాత్రమే.

మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ సినిమాలని రీమేక్ చేసి తమిళ హీరో విజయ్ భారీ విజయాలు నమోదు చేసుకున్నాడు. పోకిరి సినిమా చేసి సల్మాన్ ఖాన్ వాంటెడ్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ ని అడిగినా తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో వర్క్ చేయాలని ఉంది అంటారు.

ఇప్పటికే మహేష్ బాబు తో సినిమా చేయాలని ఎంతో మంది బాలీవుడ్ మేకర్స్ కూడా చాలా సార్లు ట్రై చేశారు కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. అయితేనేం మహేష్ రికార్డులు కొట్టడం మాత్రం ఆపలేదు. రాజమౌళితో సినిమా చేయకుండా నాలుగు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఏకైక హీరో మహేష్ మాత్రమే.

నేషనల్ మ్యాగజైన్లు అనగానే సహజంగా హిందీ స్టార్లకు, బాలీవుడ్ బ్యూటీలకే ప్రాధాన్యం ఉంటుంది. ఇక కవర్ పేజిలపై దాదాపుగా వారే ఉంటారు. అయితే ఈసారి ప్రఖ్యాత మ్యాగజైన్ వోగ్ వారు సౌత్ పై దృష్టి సారించారు. వోగ్ అక్టోబర్ కవర్ పేజీపై సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ తో అదరగొట్టాడు.

మహేష్ ప్రతీ ఫొటోలోనూ లుక్ అండ్ గెటప్ చితక్కొట్టేశాడు. గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ విషయంలో సరిలేరు నీకెవ్వరు అన్న రేంజ్ లో ఈ వోగ్ ఫొటోషూట్ పిక్స్ ఉన్నాయి. మహేష్ ను ఇంత అల్ట్రా మోడ్రన్ గా చూసి చాలా రోజులు అయ్యింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

పాన్ ఇండియా సినిమా చేయకున్నా అంత ఫేమ్ తెచ్చుకున్న మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడా అని ఇప్పటికే మీడియా గెస్ వర్క్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇటీవలే బ్లాక్‌బస్టర్ అందుకున్న క్రేజీ డైరెక్టర్ త్వరలో మహేష్ కి కధ వినిపించనున్నాడని మీడియా వర్గాలు ప్రచురిస్తున్నాయి.

ఇదే జరిగితే పాన్ ఇండియా మొత్తం మహేష్ నామస్మరణ జరుగడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మహేష్ నెక్స్ట్ సినిమా గురించి ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడలేదు కాని మీడియా మాత్రం ఇలాంటి ఊహగానాలతో రోజుకో న్యూస్ రాస్తుంది అంటే మహేష్ క్రేజ్ ఎంటో తెలుస్తుంది.

ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరుతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్లను మలచడంలో స్పెషలిస్ట్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మహేష్ కు మరో బ్లాక్ బస్టర్అందించడం ఖాయమని సినీ ప్రేమికులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

దసరా సందర్భంగా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే మాస్ పోస్టర్‌తో మురిపించిన అనిల్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ అభిమాలకు మరింత ఆనందాన్నిచ్చే మాటలు చెప్పారు. మరి ఈ సినిమా లు అన్నీ పూర్తి అయిన తరువాతే మహేష్, రాజమౌళి ల కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

Share

Leave a Comment